Chiranjeevi Pavankalyan: అగ్ర కథానాయకుడు చిరంజీవి, తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ ఈ చిత్ర దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చిరంజీవి, రామ్‌చరణ్, కొరటాల శివ, పూజాహెగ్డేలు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సిద్ధ పాత్రలో పవన్‌కల్యాణ్ ఉంటే బాగుండేదినిపించిందా అని ఓ ప్రశ్నకు చిరు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.
"నిజమైన తండ్రీకొడుకుల అనుబంధం 'ఆచార్య' కథకు అదనపు బలాన్ని తీసుకొస్తుందనే ఉద్దేశంతోనే సిద్ధ పాత్ర కోసం చరణ్‌ను తీసుకున్నాం. ఒకవేళ ఆ పాత్రను చరణ్ చేసే అవకాశం లేకపోయినా, ఇంకా ఏ ఇతర నటులూ కుదరకపోయినా ఆ ఫీల్ ఒక్క పవన్‌కల్యాణ్‌తోనే సాధ్యం" అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
"చరణ్ కాకుండా మరే నటుడైనా సిద్ధ పాత్రకు న్యాయం చేసేవారే. అయితే, నిజ జీవితంలో తండ్రీకొడుకులు ఈ పాత్రలు చేస్తే, వాటి మధ్య అనుబంధం మరింత బలంగా తెరపై కనిపిస్తుంది. కథకు అదనపు బలం చేకూరుతుంది. ఒకవేళ చరణ్ కూడా చేయకపోతే ప్రత్యామ్నాయం పవన్‌కల్యాణ్. ఎందుకంటే కథలో ఆ ఫీల్100శాతం పవన్ తీసుకువస్తాడని నా అభిప్రాయం. అంతవరకూ ఛాన్స్ తీసుకోలేదు."
- మెగాస్టార్ చిరంజీవి
ఇవీ చదవండి: