ETV Bharat / entertainment

ఈటీవీ విన్​లో శివాజీ సిరీస్ - '#90s బయోపిక్ ' ఎలా ఉందంటే ? - ఈటీవీ విన్​ వెబ్​ సిరీస్

90s web series review : సీనియర్ నటులు శివాజీ, వాసుకి లీడ్ రోల్స్​లో ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఈటీవీ విన్ వేదికగా 90స్​ మిడిల్​ క్లాస్​ బయోపిక్ సిరీస్ విడుదలైంది. మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, లాంటి యంగ్​ స్టార్స్ నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉందంటే ?

90s web series review
90s web series review
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 3:08 PM IST

90s Web Series Review : వెబ్‌సిరీస్‌ : 90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌; నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు; సంగీతం: సురేష్‌ బొబ్బలి; ఎడిటింగ్‌: శ్రీధర్‌ సోంపల్లి; సినిమాటోగ్రఫీ: అజాజ్‌ మహ్మద్‌; నిర్మాత: రాజశేఖర్‌ మేడారం; రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్

శివాజీ, వాసుకీ ఆనంద్‌ సాయి కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ వెబ్‌సిరీస్‌ '#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌'. ట్రైలర్, టీజర్​తో ఆడియెన్స్​లో ఆసక్తిని పెంచిన ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ ఈటీవీ విన్‌ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఈ సిరీస్​ స్టోరీ ఏంటీ? లెక్కల మాస్టార్‌గా సీనియర్​ నటుడు శివాజీ ప్రేక్షకులను ఎలా మెప్పించారంటే?

కథేంటంటే: చంద్రశేఖర్ (శివాజీ) ఓ గవర్నమెంట్ స్కూల్​లో లెక్కల మాస్టర్​గా పని చేస్తున్నారు. ఆయనతో పాటు భార్య రాణి (వాసుకీ ఆనంద్ సాయి), పిల్లలు రఘు తేజ (మౌళి తనూజ్ ప్రశాంత్), ఆదిత్య (రోహన్ రాయ్), దివ్య (వాసంతిక) ఉన్నారు. ప్రతిదీ లెక్క పెట్టుకుని మరీ ఖర్చులు చేసే మనస్తత్వం ఉన్న చంద్రశేఖర్‌ పిల్లల చదువు విషయంలోనూ అంతే కఠినంగా వ్యవహరిస్తుంటాడు. రఘు, దివ్య బాగానే చదువుతున్నప్పటికీ వారికి నూటికి నూరు మార్కులు రావాలంటాడు. అయితే చిన్నబ్బాయి ఆదిత్యకు చదువు సరిగా అబ్బదు. మరోవైపు పదో తరగతి చదువుతున్న రఘుకు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని తండ్రి ఆశిస్తాడు. అయితే రఘు ఆ రికార్డు సాధించాడా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ర్యాంకుల కోసం ప్రైవేటు స్కూల్స్‌ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తెస్తున్నాయి? వాటిని తట్టుకోలేక చిన్నారులు పడే మనోవేదన ఏంటి? ఇలాంటివన్ని తెలియాలంటే ఈ సిరీస్​ను చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం, కౌమర దశలు అనేవి మర్చిపోలేని అనుభూతులను ఇస్తాయి. ఇప్పుడంటే అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్‌ ఉంది. కానీ, రెండు దశాబ్దాల కిందట పరిస్థితులు ఇలా లేవు. ఒకరినొకరు పలకరించుకోవాలంటేనే ల్యాండ్‌ఫోన్‌లు, లెటెర్స్​, గ్రీటింగ్‌ కార్డులు తప్ప మరోమార్గం లేదు. ఇక ఇంటికి చుట్టాలొస్తే ఇక ఆ ఇంట్లో ఉన్న పిల్లలకు పండగే. అలాంటి ఎన్నో అందమైన అనుభూతులను సొంతం చేసుకున్న 90వ దశకం పిల్లల జ్ఞాపకాలను. అంతే అందంగా తెరపై ఆవిష్కరించడంలో యువ డైరెక్టర్ ఆదిత్య హాసన్ విజయం సాధించారు. ఆరు ఎపిసోడ్స్‌ కలిగిన ఈ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్లి మళ్లీ ఆ మధుర స్మృతులను గుర్తు చేశారు. సిరీస్‌ ప్రారంభంలో 'మిడిల్‌క్లాస్‌ లైఫ్‌ స్టైల్‌లో పెద్ద కష్టాలు, కాన్‌ఫ్లిక్ట్‌లు ఏమీ ఉండవు. ఇది పెద్ద కథేం కాదు. కేవలం మన అనుభవాలు మాత్రమే. అంచనాలు పెట్టుకోకుండా చూసేయండి' అంటూ రఘుతేజ చెప్తాడు. అతడు అన్నట్లుగానే సిరీస్‌ మొత్తాన్ని అలా చూస్తూ వెళ్లిపోతాం. మరీ ముఖ్యంగా మనం 90స్​ కిడ్స్​ అయితే ఈ సిరీస్​కు ఇంకా బాగా కనెక్ట్‌ అవుతాం

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చంద్రశేఖర్‌ వ్యవహారశైలి, భార్య, పిల్లల మనస్తత్వాలను పరిచయం చేస్తూ మొదలైన సిరీస్‌ ఆద్యంతం అంతే ఆసక్తికంగా సాగుతుంది. మన ఇంటికి మావయ్యో, తాతయ్యో వచ్చి వెళ్లేటప్పుడు ఏమైనా కొనుక్కోమని డబ్బులు ఇవ్వటం, క్రికెట్‌లో బెట్టింగ్‌ కట్టి ఓడిపోతే ఆ డబ్బులు పోగేసేందుకు చేసే ప్రయత్నాలు, పిల్లలు సరిగా చదవడం లేదంటూ కేబుల్‌ టీవీ కనెక్షన్‌ తీయించే తల్లిదండ్రులు, ఇతరుల పిల్లలు బాగా చదువుతున్నారని మన తల్లిదండ్రులు పెట్టే పోలికలు ఇలా ప్రతి సగటు మనిషి జీవితంలో జరిగిన ఘటలను ఎంతో క్షుణ్నంగా చూపించారు. ఇక పదో తరగతి వచ్చే సమయానికి పిల్లల్లో ఏర్పడే ఆకర్షణలను చూపించిన తీరు నవ్వులు పంచుతూనే ఇంకోవైపు అందంగా ఉంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో జ్ఞాపకాలు ఇందులో కనిపిస్తూనే ఉంటాయి. ఇది పూర్తయిన తర్వాత ఒంటరిగా కూర్చొంటే మన బాల్యం కళ్ల ముందు ఫ్లాష్‌ అవుతుందంటే డైరెక్టర్ మనల్ని సిరీస్‌కు ఎంతలా కనెక్ట్‌ చేశాడో అర్థం చేసుకోవచ్చు.

ఎవరెలా చేశారంటే : లెక్కల మాస్టార్‌గా చంద్రశేఖర్ రోల్​లో శివాజీ ఒదిగిపోయాడు. బిగ్‌ బాస్‌తో కొత్త జర్నీ మొదలు పెట్టిన ఆయన ఇప్పుడు ఈ వెబ్‌ సిరీస్‌తో మరోసారి మళ్లీ ట్రాక్‌ ఎక్కారు. ఒక రకంగా మధ్యతరగతి తండ్రికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆయన నిలిచారు. గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90స్​లో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. రఘు పాత్రలో మౌళి నటన చాలా నేచురల్​గా ఉంది. వాసంతి, స్నేహాల్ కామత్ కూడా చాలా చక్కగా నటించారు. ఆదిత్యగా నటించిన రోహన్ క్యారెక్టర్‌ ఆద్యంతం నవ్వులు పంచుతుంది. సాంకేతికంగా సిరీస్‌ బాగుంది. మ్యూజిక్, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా చక్కగా కుదిరాయి. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి టీమ్‌ పడిన కష్టం స్క్రీన్‌పై ఇట్టే కనిపిస్తుంది. 'పిల్లలు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రోత్సహించని పేరెంట్స్‌, టీచర్లు, వాళ్లు కష్టపడి సాధించిన తర్వాత ప్రశంసించే హక్కు కోల్పోతారు' వంటి డైలాగ్స్ బాగున్నాయి. డైరెక్టర్ ఆదిత్య హాసన్‌ ప్రతి ఒక్కరికీ ఈ సిరీస్​ ద్వారా అందమైన జ్ఞాపకాలను అందించారు.

ఫ్యామిలీతో చూడొచ్చా: నూటికి నూరు పాళ్లు ఈ సిరీస్​ను కుటుంబమంతా కలిసి చూడొచ్చు కుదిరితే మీ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి చూడండి. ఈటీవీ విన్‌లో ఇప్పుడు ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది.

బలాలు
+ నటీనటులు
+ కథ, దర్శకత్వం
+ సాంకేతిక విభాగం పనితీరు

బలహీనతలు
- అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: అందమైన అనుభూతులను ఇచ్చే '#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌'

'విన్నర్ నేనే, నాకు తెలుసు'- శివాజీ రెమ్యునరేషన్ అన్ని లక్షలా? ప్రశాంత్​ కంటే ఎక్కువ జాక్‌పాట్!

ఈటీవీ విన్​లో 'మిడిస్‌ క్లాస్‌ బయోపిక్‌' నవ్వులు పంచుతోందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.