ETV Bharat / entertainment

2023 Top 5 Movies : టాప్​ 5 లిస్ట్​లో 'లియో', 'జైలర్​'​.. మరి 'సలార్​' నిలుస్తుందా?

2023 Top 5 Movies : ఈ ఏడాది పలు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్​లో రూపొంది వరుస హిట్స్​ ఇచ్చి రికార్డుకెక్కాయి. అత్యధిక వసూళ్లను అందుకుని చేసిన టాప్​ 5 జాబితాలోకి చేరుకున్నాయి. అయితే అందులో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి కారణం ఏంటంటే ?

Top5 Movies 2023 : టాప్​ 5 సినిమాల్లో.. టాలీవుడ్​ నుంచి 'సలార్' నిలుస్తుందాా..!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 5:20 PM IST

2023 Top 5 Movies : గత కొన్ని సంవత్సరాల నుంచి టాలీవుడ్ సినిమాలు పాన్​ ఇండియా లెవల్​లో సూపర్ హిట్స్ అందుకుని సెన్సెషన్​ క్రియేట్​ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 'బాహుబలి', 'పుష్ప1' 'ఆర్ఆర్ఆర్' ఇలా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్​ హిట్స్​ అందుకోవడమే కాకుండా తెలుగు సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చిపెట్టాయి. ఇలా దాదపు గత 5 ఏళ్ల నుంచి ఏటా ఏదొక సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్​ అందుకుంటూ తెలుగు సినిమాల ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఆ పద్దతికి బ్రేక్ పడింది.

మరో రెండు నెలల్లో 2023 సంవత్సరం కూడా పూర్తి అవ్వనుంది. అయితే టాలీవుడ్​ నుంచి ఇంతవరకూ ఏ సినిమా పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందలేదు. భారీ సినిమాలే వచ్చినప్పటికీ.. ఇండియా స్థాయిలో ఒక్క హిట్​ కూడా పడలేదు.

ఇక ఇండియా వైడ్​ టాప్​ మూవీస్​ లిస్ట్​లో 'జవాన్​', 'పఠాన్', 'జైలర్', 'లియో', 'గద్దర్2' ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఏ ఒక్క టాలీవుడ్​ చిత్రం పేరు కూడా ఉండకపోవడం గమనార్హం. అయితే మిగతా భాషల సినిమాలు ఈ ట్రెండ్​లో చేరుకుని రికార్డులు సృష్టించాయి కలెక్షన్ల పరంగాను దూసుకెళ్లాయి. ఏడాది మొదట్లో తెరకెక్కిన 'జవాన్​' నుంచి తాజాగా వచ్చిన 'లియో' వరకు అన్నీ వేరే భాష సినిమాలే.

ఇటీవలే పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కిన ప్రభాస్​ 'ఆదిపురుష్'​ కూడా బాక్సాఫీస్​ వద్ద నిలవలేకపోయింది. ఇక తాజాగా విడుదలైన టైగర్​ నాగేశ్వర రావు కూడా మంచి టాక్​ అందుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను అందుకోలేకపోతోంది. అయితే గతేడాది మాత్రం టాలీవుడ్​లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' ఇంటర్నెషనల్ లెవెల్​లో దూసుకెళ్లి.. ఆస్కార్​ను కూడా అందుకుంది. అయితే ఈ సంవత్సరం కనీసం ఇండియా స్థాయిలో చెప్పకొదగిన విధంగా ఒక్క సినిమా కూడా లేవన్న విషయం తెలుగు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2024 Tollywood Movies : దీంతో రానున్న కాలంలోనైనా ఆ స్థాయి సినిమాలు మన టాలీవుడ్​లోనూ రావాలని తెలుగు మూవీ లవర్స్ ఆశిస్తున్నారు. 'సలార్', 'దేవర', 'కల్కి 2898 ఏడీ', లాంటి పాన్ ఇండియా చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్న తరుణంలో ఈ సారైనా పాన్ ఇండియా లెవెల్​లో సాలిడ్​ హిట్ పడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Salaar Vs Dunki : 'సలార్​' దెబ్బ.. 'డంకీ' అబ్బా.. షారుక్ కొత్త మూవీ రిలీజ్​ వాయిదా!

Bhagavanth kesari vs Leo vs tiger nageswara rao Collections : దసరా ముగిసింది.. ఇక అసలు కథ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.