ETV Bharat / crime

ysrcp leader attack: దివ్యాంగ ఉద్యోగిపై.. వైకాపా నాయకుడి దాష్టీకం! - ఉద్యోగిపై వైకాపా నాయకుడి దాష్టీకం వార్తలు

ysrcp leader attack: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని కవిటి అగ్రహారం సచివాలయ ఉద్యోగిపై.. స్థానిక వైకాపా నేత దాడికి పాల్పడ్డారు. ‘మేం చెప్పిన వారికి కాకుండా ఇతర పార్టీకి చెందిన వారికి పింఛన్ ఎందుకు ఇచ్చావు’ అంటూ భౌతిక దాడికి దిగారు.

Attack: దివ్యాంగ ఉద్యోగిపై.. వైకాపా నాయకుడి దాష్టీకం!

author img

By

Published : Jun 26, 2022, 3:46 PM IST

ysrcp leader attack: ‘మేం చెప్పిన వారికి కాకుండా ఇతర పార్టీకి చెందిన వారికి పింఛన్ ఎందుకు ఇచ్చావు’ అంటూ.. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని కవిటి అగ్రహారం సచివాలయ ఉద్యోగిపై స్థానిక వైకాపా నేత బొమ్మాళి గున్నయ్య దాడికి దిగారు. శనివారం సాయంత్రం దాదాపు 4.30 సమయంలో కార్యాలయానికి వచ్చిన ఆయన.. వచ్చీ రాగానే స్థానిక డిజిటల్‌ అసిస్టెంట్‌ కరుకోల వాసుదేవరావును ఇదే విషయమై ప్రశ్నించారు. అనంతరం భౌతిక దాడికి దిగారు.

అర్హులకే ఇచ్చామని చెప్పినా వినకుండా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడితో ఆగకుండా సమీపంలోని రైలుపట్టాల వద్ద మరోసారి దాడికి యత్నించారు. బాధితుడు దివ్యాంగుడు అని కూడా చూడలేదు. ఈ దాడి ఘటన సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్‌ కావడంతో జిల్లావ్యాప్తంగా కలకలం రేగింది.

ఉద్యోగుల ఆందోళన.. దాడికి దిగిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. స్థానిక సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గతంలో ఇదే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డారని, వైకాపా నేతల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇలా భౌతిక దాడులకు పాల్పడుతుంటే విధులు ఎలా నిర్వర్తించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. తర్వాత నందిగాం పోలీస్‌స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గాయాలపాలైన వాసుదేవరావు టెక్కలి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

సిబ్బందిపై సర్పంచి ఫిర్యాదు.. మరోవైపు కవిటి అగ్రహారం సచివాలయ సిబ్బంది తరచూ తనను వేధిస్తున్నారని, దీనిని తన భర్త గున్నయ్య వద్ద ప్రస్తావిస్తే ఆయన కోపంతో సచివాలయానికి వెళ్లి డిజిటల్‌ అసిస్టెంట్‌, సిబ్బందిని ప్రశ్నిస్తుండగా మాటామాటా పెరిగి గొడవకు దారితీసిందని సర్పంచి వరలక్ష్మి ఎస్‌ఐ మహమ్మద్‌ యాసిన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ఫలక్‌నుమాలో యువకుడు సజీవదహనం.. బాలికతో పెళ్లి చేయాలని బెదిరిస్తూ..

కులం, మతం లేని ధ్రువపత్రం.. ఆదర్శంగా నిలిచిన దంపతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.