మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తకు భార్య బడితెపూజ చేసింది. ఓ గదిలో ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక బాదింది. ఈ సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ తులసినగర్‌లో జరిగింది.
నగరంలో బంజారాహిల్స్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఏపీలోని గుంటూరు జిల్లాకు పెద్దపరిమికి చెందిన ప్రకాశ్‌కు అదే జిల్లాకు చెందిన త్రివేణితో 2019లో వివాహం జరిగింది. అదే సమయంలో వరకట్నం కింద రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు నగలు, 3 ఎకరాల భూమి ఇచ్చినట్లు బాధితురాలు వాపోయారు. పెళ్లయిన నెల రోజులకే తనను దూరం పెట్టేవారని ఆమె తెలిపింది.
హైదరాబాద్‌లో కాపురం పెట్టాక ప్రకాశ్ తనను హింసించేవారని.. రాత్రిళ్లు ఇంటికి కూడా వచ్చేవారు కాదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తనతో వ్యక్తిగతంగా ఉన్న ఫోటోలను అతని స్నేహితులకు చూపించేవాడని.. ఆ బాధలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశానని త్రివేణి ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలలుగా భార్యను పట్టించుకోకుండా తిరుగుతున్నాడని ఆమె కుటుంసభ్యులు తెలిపారు. ఇతరుల ద్వారా తనభర్త కేపీహెచ్‌బీలోని తులసినగర్‌లో ఉండగా కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి అతన్ని పట్టుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాశ్, మరో మహిళను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు.
ఇదీ చూడండి:
Facebook friendship: ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది.. యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది.!