ETV Bharat / crime

రూ.50 లక్షలు తీసుకుని విడిచిపెట్టిన కిడ్నాపర్లు - rajapur news today

రెండు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు 50 లక్షల రూపాయలతో భూమి రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్తూ ఇద్దరు అదృశ్యమయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో వారికోసం పోలీసులు వెతికినా ఆచూకీ లభించలేదు. కానీ ఇవాళ వారి వద్ద నుంచి దుండగులు ఆ డబ్బులు తీసుకుని వారిని విడిచిపెట్టినట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్లు ఎవరు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

rajapur peddapalli news, Unidentified people took Rs 50 lakh
రూ.50 లక్షలు తీసుకుని విడిచిపెట్టిన కిడ్నాపర్లు
author img

By

Published : Apr 19, 2021, 9:01 AM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్​కు చెందిన రేషన్ డీలర్ చిప్ప రాజేశం, లద్నాపూర్​కు చెందిన ఉడుత మల్లయ్య రెండు రోజుల క్రితం రూ.50 లక్షలతో భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్తూ ఇద్దరు అదృశ్యమయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదు.

ఇవాళ ఉదయం రెండు గంటల ప్రాంతంలో వారి వద్ద ఉన్న రూ.50 లక్షలు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకుని.. రాజాపూర్ గ్రామ శివారులో ఇద్దరిని విడిచిపెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్యలను విచారిస్తున్నారు. కిడ్నాపర్లు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి : ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.