ETV Bharat / crime

ప్రమాదవశాత్తు కాలువలో పడి బావ, బావమరిది మృతి - కాలువలో పడి విద్యార్థులు గల్లంతు

Youngsters drown in canal: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటనతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

canal
canal
author img

By

Published : Apr 11, 2022, 4:44 PM IST

Updated : Apr 11, 2022, 5:18 PM IST

Youngsters drown in canal: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువ​లో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆ విషాదకర ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన అంబాల రమేష్​కు ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు వంశీ ఇంటర్ మధ్యలోనే చదువు మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు.

ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు: నాలుగు రోజుల క్రితం కాజిపేటలో ఉంటున్న మేనత్త కుమారుడు వరుణ్​ దేవుడి పండుగకి ఎల్కతుర్తికి వచ్చాడు. వరుసకి వారిద్దరు బావ బామర్ధులు. ఈరోజు ఉదయం ఇద్దరు ఇంటి పక్కనే ఉన్న కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్​లో పడిపోయి గల్లంతయ్యారు. ఇదంతా వాళ్ల చిన్నాన్న అంబల స్వామి చూస్తుండగానే జరగడంతో... వెంటనే ఆయన కెనాల్‌లో దూకి కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది.

మృతదేహాలు లభ్యం: యువకుల ఆచూకీ కోసం రెస్క్యూ టీం కెనాల్‌లో సుమారు 5 గంటలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అనంతరం కుటుంబాలకు వారి మృతదేహాలను అప్పగిస్తామన్నారు. గత సంవత్సరమే కరోనా సోకి వంశీ తండ్రి మృతి చెందాడు. ఇంతలోనే ఈ ఘటన జరగడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

ఇదీ చదవండి:btech student suicide: 'క్విట్టింగ్‌ మై లైఫ్‌.. సారీ మమ్మీ డాడి'

Last Updated : Apr 11, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.