ఏపీలోని విశాఖలో ఓ వృద్ధురాలిని నమ్మించి రూ. 93లక్షలు కాజేసిన ఘటనలో నాగభూషణం, రమణమ్మను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 24లక్షల నగదు, రూ. 25లక్షల విలువైన బంగారం, 6కేజీల వెండి, ఒక ద్విచక్రవాహనం, ఐఫోన్, రూ. 5లక్షల విలువ చేసే బాండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇద్దరు కలిసి గాజువాక శ్రీనగర్‌లోని అపార్ట్మెంట్లో ఫ్లాట్, స్థలాలు ఇప్పిస్తానని చెప్పి వృద్ధురాలు లీలావతి నుంచి పలు దఫాలుగా రూ. 98 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తెలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక