ETV Bharat / crime

ఎన్టీఆర్ జిల్లాలో ఆగని కిడ్నీ మరణాలు

Two people died with kidney disease: ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో కిడ్నీ మరణాలు ఆగడం లేదు.. ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు కిడ్నీవ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. ఎ. కొండూరులో మాలపల్లికి చెందిన పొన్నంపల్లి డేవిడ్ రాజు, దీప్లానగర్ తండాకు చెందిన భూక్య సీతమ్మ విజయవాడ ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Two people died with kidney disease
ఎన్టీఆర్ జిల్లాలో ఆగని కిడ్నీ మరణాలు
author img

By

Published : Dec 29, 2022, 5:36 PM IST

Two people died with kidney disease: కిడ్నీభూతం ఎన్టీఆర్ జిల్లాను వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కిడ్నీ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. మారుతున్న జీవనశైలితో పాటుగా అవగాహనలోపం.. నిర్లక్ష్యం తదితర కారణాలతో చాలామంది కిడ్నీ వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్ జిల్లాలో ఏ కొండూరు మండలంలో సైతం కిడ్నీ మరణాలు ఆగడం లేదు. ఎ. కొండూరు మండలంలో ఒకేరోజు ఇద్దరు కిడ్నీ బాధితులు కన్నుమూశారు.

మండలంలోని మాలపల్లికి చెందిన పొన్నంపల్లి డేవిడ్ రాజు విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తుండగా మరణించాడు. మరో ఘటనలో దీప్లానగర్ తండాకు చెందిన భూక్య సీతమ్మ మరణించారు. రాత్రి విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం నేతలు ప్రభుత్వాన్ని డిమాడ్ చేశారు. కిడ్నీ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.