ETV Bharat / crime

Dead bodies found: మానేరు వాగులో గల్లంతైన మరో నలుగురి మృతదేహాలు లభ్యం

మానేరు వాగులో గల్లంతైన విద్యార్థుల్లో మరో నలుగురి మృతదేహాలను(Dead bodies found) ఇవాళ వెలికితీశారు. తొమ్మిది మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా వారిలో ఆరుగురు గల్లంతయ్యారు(missing in Manair check dam). ఇందులో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

Dead bodies found, manair dam incident
మానేరు డ్యాంలో విద్యార్థుల గల్లంతు, మానేరు డ్యాం ఘటన
author img

By

Published : Nov 16, 2021, 11:40 AM IST

Updated : Nov 16, 2021, 4:51 PM IST

మానేరు వాగులో గల్లంతైన విద్యార్థుల్లో ఇవాళ నాలుగు మృతదేహాలు(Dead bodies found) లభ్యమయ్యాయి. మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు సోమవారం రోజున మానేరు వాగు చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లగా... వారిలో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు((missing in Manair check dam). ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. 8వ తరగతి విద్యార్థి గణేశ్ మృతదేహం(dead body found in water) సోమవారం లభ్యమైంది. ఇవాళ వెంకటసాయి, క్రాంతి, అజయ్, రాకేశ్ మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మనోజ్ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

మంత్రి కేటీఆర్ విచారం

మానేరు వాగులో విద్యార్థుల గల్లంతు ఘటనపై మంత్రి కేటీఆర్(ktr news) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీతో మంత్రి మంగళవారం ఉదయం మాట్లాడారు. ఈ ఘటనపై ఆరా తీశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యల కోసం హైదరాబాద్ నుంచి గజఈతగాళ్ల బృందం ఘటనా స్థలికి చేరుకుంది. కాగా డీఆర్ఎఫ్(DRF News) అధికారులతోనూ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మానేరు వాగులో విద్యార్థుల గల్లంతు ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఏం జరిగింది?

ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla news) జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాకేంద్రం శివారులోని మానేరు చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు(students) గల్లంతు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వారిలో రాజీవ్‌నగర్​కు చెందిన గణేశ్‌ మృతదేహం సోమవారం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. సిరిసిల్ల జిల్లాకేంద్రం వెంకంపేట ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులుగా వారిని గుర్తించారు.

ముమ్మర గాలింపు

ఇప్పటివరకు గణేశ్, వెంకటసాయి, క్రాంతి, అజయ్, రాకేశ్ మృతదేహాలను వెలికితీశారు. మరో విద్యార్థి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. తాళ్ల సాయంతో గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మానేరు చెక్‌డ్యామ్‌లో ఈత కొట్టేందుకు మొత్తం 9 మంది విద్యార్థులు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

మరో ఘటనలో

ఇదిలా ఉండగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లిలో రెండు మృతదేహాలు(Dead bodies found in pond) లభ్యం కావటం కలకలం రేపింది. దాదాయిపల్లి శివారులోని గచ్చుకుంటలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గ్రామస్థులు గుర్తించారు. నాలుగేళ్ల రిశ్వంత్‌, రెండేళ్ల రక్షిత చనిపోయినట్లుగా తేల్చారు. చిన్నారుల తల్లి కోటంగారి రంజిత కోసం గ్రామస్థులు గాలిస్తున్నారు. భర్తే హత్య చేసి కుంటలో పడేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: MISSING:

Last Updated : Nov 16, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.