ETV Bharat / crime

Sagar Road accident: స్కూటీని ఢీకొన్న ​లారీ.. ఇద్దరు ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి - engineering students died in road accident

హైదరాబాద్​ సాగర్​ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీని బోర్​వెల్స్​ లారీ ఢీకొన్న ఘటనలో.. ఇద్దరు ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

two engineering students died in Sagar Road accident

author img

By

Published : Nov 24, 2021, 10:07 PM IST

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ రోడ్​పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానాన్ని బోర్​వెల్స్​ లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్​ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థికి గాయాలయ్యాయి.

ముగ్గురు ఇంజినీరింగ్​ విద్యార్థులు రోహిత్​రెడ్డి, విశాల్​, గౌతమ్​.. స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన బోర్​వెల్స్​ లారీ ఢీకొంది. దీంతో స్కూటీ అదుపుతప్పి కింద పడగా.. రోడ్డుపై పడ్డ యువకులపై నుంచి లారీ వెళ్లింది. ఈ ప్రమాదంలో రోహిత్​రెడ్డి, విశాల్​ తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థి గౌతమ్​ మాత్రం గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.