కరీంనగర్- లక్సెట్టిపేట ఏడో నెంబరు జాతీయ రహదారి.. పాశిగామ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొత్తపేటకు చెందిన దంపతులు.. తమ ముగ్గురు పిల్లల(ఒక పాప, ఇద్దరు అబ్బాయిలు)తో కలిసి ధర్మపురి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్కూటీపై వస్తున్నారు. పాశిగామ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం.. స్కూటీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారుల శరీరభాగాలు పూర్తిగా ఛిద్రమై.. రక్తసిక్తంగా మారాయి. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీర భాాగాలు నుజ్జునుజ్జయ్యాయి. మరో చిన్నారికి కాలు విరిగింది. మృతుల్లో పాప, బాబు ఉన్నారు. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి
ప్రమాదంలో తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్నిగుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా ఘటనాస్థలంలో రిషిత(9) అన్విత్(1) మృతి చెందగా.. వారి తండ్రి తిరుపతి(35) ఆస్పత్రిలో కన్నుమూశాడు. దీంతో ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.
ఇదీ చదవండి: High Court: కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికే అనుమతి: హైకోర్టు