సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రేఖ(28), తన నాలుగేళ్ల చిన్నారి, మరిది బాసువ్దే కుష్బా(27)తో కలిసి.. బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చారు. భానూరులో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం వీరు చిన్నారితో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆత్మహత్యకు వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులను ఆరా తీస్తున్నారు.