ETV Bharat / crime

Niloufer Hospital News : రూ.100 కోసం వార్డుబాయ్ కక్కుర్తి.. అభంశుభం తెలియని చిన్నారి బలి! - తెలంగాణ వార్తలు

ప్రాణాలు పోసే ఆస్పత్రుల్లో కొందరి కాసుల కక్కుర్తి అభంశుభం తెలియని వారిని పొట్టన బెట్టుకుంటోంది(Ward Boy removed Oxygen pipe for money). వార్డుబాయ్ వంద రూపాయల కక్కుర్తి.. ఓ చిన్నారిని బలి తీసుకుంది. కేవలం రూ.100కు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారి ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు ఓ వార్డుబాయ్. ప్రాణవాయువు అందక ఉక్కిరిబిక్కిరి అయి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. కొన్ని క్షణాల్లోనే కన్నుమూశాడు.

crime news in telugu, niloufer hospital
నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం, వంద రూపాయల కక్కుర్తితో చిన్నారి బలి
author img

By

Published : Oct 31, 2021, 8:56 AM IST

Updated : Oct 31, 2021, 12:24 PM IST

అభంశుభం తెలియని చిన్నారి బలి

వంద రూపాయలకు కక్కుర్తిపడిన వార్డుబాయ్‌.. ఆక్సిజన్‌ పైపును వేరేవారికి మార్చడంతో మూడున్నరేళ్ల బాలుడు కన్నుమూశాడు(Ward Boy removed Oxygen pipe for money). ఈ ఉదంతం హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో జరిగింది. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్‌ ఆజం కుమారుడు మహ్మద్‌ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. మొదట ఓ ఆసుపత్రిలో చేరగా, అక్కడ రెండు, మూడు రోజులకే రూ.2 లక్షల బిల్లు అయ్యింది. అంతకన్నా ఖర్చులు భరించే స్థోమత లేక తలిదండ్రులు మూడు రోజుల క్రితం నిలోఫర్‌లో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచారు.

వేరే పేషెంట్ కోసం..

శనివారం బాలుడికి స్కానింగ్‌ తీయించాల్సి ఉంది. అక్కడికి తీసుకెళ్లడానికి ఆక్సిజన్‌ సిలిండర్‌ను సమకూర్చాల్సి ఉంది. ఆ లోగానే ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న వార్డుబాయ్‌ సుభాష్‌... ఆ బాలుడికి పెట్టిన ఆక్సిజన్‌ పైపును తీసి పక్క పడకలో ఉన్న రోగికి అమర్చినట్లు నాంపల్లి ఠాణా ఇన్‌స్పెక్టర్‌ ఎం.డి.ఖలీల్‌పాషా తెలిపారు. వారి వద్ద రూ.100 తీసుకుని ఈ పనికి పాల్పడ్డారని వెల్లడించారు. దీంతో కొద్దిక్షణాల్లోనే బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. బాధిత కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు.

వార్డుబాయ్ సస్పెండ్

వైద్యులు వచ్చేలోపే ఆ చిన్నారి తుదిశ్వాస(crime news in Telegu) విడిచాడు. ఆగ్రహించిన బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రి వచ్చి పరిశీలించి, సిబ్బంది తీరు, వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ వార్డుబాయ్‌ సుభాష్‌ను వెంటనే సస్పెండ్‌ చేశారు.

వైద్యుల నిర్లక్ష్యమేనా..

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలయ్యాడు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మృతి చెందాడు. ఎర్రగడ్డకు చెందిన ఖాజా పాషా (4) అనే బాలుడు ఆరోగ్యం విషమించడంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేయడానికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఆస్పత్రి ఎదుట ఆందోళన

దీంతో ఆందోళన ఉద్ధృతం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆస్పత్రిలో పని చేసే వార్డుబాయ్, వైద్యులు ఆక్సిజన్ పెట్టకుండా సీటీ స్కానింగ్ చేసేందుకు తీసుకెళ్లడంతో మార్గమధ్యలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వహించిన వార్డ్ బాయ్​తో పాటు వైద్యులపై చర్యలు తీసుకుని బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే భాషా ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చదవండి : Corden Search: కూకట్‌పల్లిలో కార్డన్‌ సెర్చ్‌.. వాహనాల జప్తు

Last Updated : Oct 31, 2021, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.