ETV Bharat / crime

మైనర్ బాలిక అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

author img

By

Published : Jan 30, 2021, 8:36 PM IST

ఓ మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

minor girl missing
మైనర్ బాలిక అదృశ్యం

ఓ 17 ఏండ్ల మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా లట్టుపల్లి గ్రామానికి చెందిన బి. సౌమ్య ఎస్​ఎస్​సీ పూర్తి చేసి... ఇంటర్​లో చేరేందుకు హైదరాబాద్ వచ్చింది. హిమాయత్ నగర్​లోని బంధువుల ఇంట్లో ఉండే ఆ యువతి ఈ నెల 28న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో బంధువులు ఆమె తండ్రి మహేష్​కు సమాచారం ఇచ్చారు.

నగరానికి చేరుకున్న యువతి తండ్రి నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదే బస్తీలో ఉండే రజిని అనే యువతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పోషించలేక ఐదురోజుల శిశువును అమ్మేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.