ప్రయాణికులతో వెళ్తోన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.
సారపాక గ్రామ సమీపంలోని పుష్కరవనం వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ వేగంగా ఢీ కొట్డడంతో బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 15 మంది ప్రయాణికులున్నారని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్సకోసం 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: కోతుల నుంచి తప్పించుకోబోయి విద్యార్థిని మృతి