కోతుల బారినుంచి తప్పించుకోబోయిన ఓ విద్యార్థిని భవనం పైనుంచి పడి మృతిచెందిన ఘటన వరంగల్లో జరిగింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నాగుర్లపల్లికి చెందిన శిరీష... ఇటీవల ఎంసీఏ పూర్తిచేసింది. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని భట్టుపల్లి కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతోంది.
తోటి విద్యార్థులతో కలిసి భవనంపై షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కోతులను చూసి భయపడ్డారు. అవి దాడి చేస్తాయన్న భయంతో విద్యార్థులందరూ పరుగెత్తడంతో భవనంపై నుంచి పడి చనిపోయింది.
ఇదీ చదవండి : లైవ్ వీడియో: కారు బీభత్సం... పలువురికి తీవ్ర గాయాలు