ETV Bharat / crime

Sexual abuse: చిన్నారులపై మృగాళ్ల కన్ను... రోజురోజుకు పెరుగుతున్న నేరాలు

మహిళలు, చిన్నారులు.. ఆఖరికి వృద్ధులపై కూడా అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో కొందరు మృగాళ్లు ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. చట్టాలు కఠినతరం అవుతున్నా.. ఎన్ని శిక్షలు వేస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.

special story on Sexual abuse of children
child-abuse
author img

By

Published : Oct 23, 2021, 9:53 AM IST

  • ఓ బాలికల గురుకుల పాఠశాలలో కాపలాదారు పదోతరగతి బాలికపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడటంతో వికారాబాద్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
  • యాలాల మండలంలో మతిస్థిమితం లేని బాలికపై ఓ యువకుడు ఇదే విధంగా వ్యవహరించడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
  • పూడూరు మండలంలో ఐదేళ్ల బాలికపై 50 ఏళ్లు దాటిన వ్యక్తి అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
  • వికారాబాద్‌లో తొమ్మిదోతరగతి చదువుతున్న బాలికను ఆటో చోదకుడు రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు తీసుకెళ్లి తీసుకొస్తుండేవాడు. ఈ క్రమంలో బాలికను లోబర్చుకుని లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.

అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నైతికత విషయంలో రోజురోజుకు దిగజారుతున్న విషయాన్ని విస్మరిస్తున్నాం. ఇందుకు నిదర్శనమే చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు. అభం, శుభం తెలియని పిల్లల విషయంలో కొందరు మృగాళ్లు ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. చట్టాలు కఠినతరం అవుతున్నా.. ఎన్ని శిక్షలు వేస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నెలల్లో 72 పోక్సో కేసులు నమోదయ్యాయంటే తీవ్రత ఎలా ఉందో అర్థం అవుతోంది. వీటికి అడ్డుకట్ట వేయాలంటే తల్లిదండ్రుల్లో అవగాహన, బాలికల్లో చైతన్యం, అప్రమత్తత అవసరం. మంచి, చెడు స్పర్శలపై పాఠశాలల్లో బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ఏర్పాటైన శక్తి బృందాలు సైతం ఎవరితో ఎలా మెలగాలి, ఎలా రక్షణ పొందాలనే అంశాలపై వివరిస్తున్నాయి.

....

ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థినులు

పిల్లలు ఏంచేస్తున్నారు..:

ప్రస్తుతం భార్యాభర్తలు పనిచేస్తేనేగానీ ఇల్లు గడవని పరిస్థితి. ప్రేమగా చూసుకునే పిల్లలు దాడులకు గురైతే వారు పడే వేధన వర్ణనాతీతం. ఉరుకుల పరుగుల జీవనంతో హడావుడిగా విధులకు వెళ్లిపోతూ, పిల్లలు ఏంచేస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు. పరిసరాలు, మిత్రులు తదితర అంశాలు వారిని ప్రభావితం చేస్తాయి. పాఠశాలకు వెళ్తున్నారా, ఎవరెవరితో స్నేహంగా ఉంటున్నారు, వారి అలవాట్లను పెద్దలు గమనించాలి. నిత్యం ప్రేమగా మాట్లాడితేనే సమస్య ఉంటే చొరవగా చెప్పుకోగలుగుతారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

వసతిగృహాల్లో చేర్పిస్తే మేలు..:

లైంగిక దాడుల కేసులను పరిశీలిస్తే ఎక్కువ శాతం వలసలు వెళ్లే ప్రాంతాల్లోనే చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒంటరిగా ఉన్న బాలికలను తెలిసిన వారే తినుబండారాలు వంటివి ఆశ చూపి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా జరుగకుండా ఉండాలంటే ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. లేదంటే వెంట తీసుకెళ్లడం మంచిది.

ప్రయాణంపై నిఘా ..:

చాలా మంది విద్యార్థినులు నిత్యం గ్రామాల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే బస్సు కోసం నిరీక్షించలేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణ సమయంలో పరిచయమైన కొందరు ప్రేమ పేరుతో వేధిస్తుంటే.. మరికొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోలీసుల దృష్టికి కొన్ని మాత్రమే వస్తున్నాయి. పిల్లలను వాహనాల్లో పంపేప్పుడు ఆ చోదకుడి వ్యక్తిత్వాన్ని పరిశీలించాలి.

చరవాణి వినియోగంపై...

కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్‌ తరగతుల కోసం ప్రస్తుతం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు చరవాణి వినియోగిస్తున్నారు. అంతర్జాల సదుపాయం ఉండటంతో నిషేధిత వెబ్‌సైట్లకు ఆకర్షితులవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. క్రమేపీ వాటికి బానిసలవుతూ తప్పుదారి పడుతున్నారు. ఇటీవల వికారాబాద్‌ పట్టణానికి చెందిన ఓ బాలిక ఫోన్‌ ద్వారా పరిచయమైన యువకుడి కోసం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. పిల్లలు చరవాణిని ఎంతసేపు వినియోగిస్తున్నారు, ఎలాంటి సైట్లు చూస్తున్నారో ఓ కన్నేసి ఉంచాలి. తప్పుదారి పడుతున్నట్లు తెలిస్తే సున్నితంగా హెచ్చరించాలి.

ఏంచేయాలి..:

  • శరీరంలోని వివిధ భాగాలను తాకుతూ కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అడ్డు చెప్పాలి.
  • తెలిసిన వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
  • సన్నిహితంగా మెలిగే వారైనా, మరెవరైనా వారి ప్రవర్తనలో తేడా ఉంటే తక్షణం తల్లిదండ్రులకు తెలుపాలి.
  • ఎవరైనా దురుద్దేశంతో తాకినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి.
  • అందరికీ తెలిసేలా కేకలు వేస్తే చుట్టుపక్కల వారు గమనించి సాయం చేసే అవకాశం ఉంటుంది.

తల్లిదండ్రులు ఇవి పాటించాలి..:

  • నెలకోసారైనా పిల్లల పాఠశాలకు వెళ్లి ఆరా తీయాలి.
  • ఎవరితో ఎక్కువగా ఉంటున్నారు.. ఎలా మసులుకుంటున్నారో తెలుసుకోవాలి.
  • వాహనంలో నెలకో రోజైనా వారితో కలిసి ప్రయాణించాలి.
  • యుక్త వయసులో వచ్చే శారీరక మార్పులు, చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాలపై చర్చించాలి.
  • ఒకవేళ తప్పుదోవ పడుతున్నట్లు గుర్తిస్తే సున్నితంగా హెచ్చరించి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి.
....

అవగాహనతోనే అడ్డుకట్ట.. :

లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయాలంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం అవసరమని గుర్తించాం. యువతులతో కూడిన శక్తి బృందాలను నియమిస్తున్నాం. ఈ బృంద సభ్యులు జిల్లా వ్యాప్తంగా పలు అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాల్లో బాలికలకు, కాలనీలు, గ్రామాల్లో తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.

- నారాయణ, జిల్లా పోలీసు అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.