Foreign Gold Seized: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒకటిన్నర కిలోకుపైగా విదేశీ అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల లగేజి తనిఖీ చేయగా అక్రమ బంగారం గుట్టురట్టయింది. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు... వారి నుంచి రూ.89.74 లక్షలు విలువ చేసే 1,680 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి..
'20 ఏళ్లు మాట్లాడుకునేలా.. రాహుల్ గాంధీ బహిరంగ సభ'
Rahul Gandhi Telangana Tour: రాహుల్ సభకు కాంగ్రెస్ శ్రేణుల భారీ సన్నాహాలు