జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా (TSRTC bus)పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కాగా సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారు. హుస్నాబాద్ నుంచి జగద్గిరిగుట్టకు వెళ్తుండగా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ సమీపంలో పంట పొలాల్లో ప్రమాదం (ACCIDENT) చోటుచేసుకుంది. బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో కలిపి 12 మంది ఉన్నారు. గాయపడిన డ్రైవర్, కండక్టర్‌లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: పోలీసులు చెప్పినా వినలేదు.. వరదలో గల్లంతై వ్యక్తి మృతి...