హైదరాబాద్‌లోని నటి షాలూ చౌరాసియాపై దాడి కేసులో పురోగతి లభించింది. చౌరాసియాపై దాడి (Attack on Shalu Chourasia) కేసులో నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన (Attack on Shalu Chourasiya) వ్యక్తి సినీ పరిశ్రమలో లైట్ బాయ్‌గా పనిచేస్తున్న బాబుగా గుర్తించారు.
కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద దుండగుడు నటి షాలూ చౌరాసియాపై దాడి (Attack on Shalu Chourasiya) చేసి పారిపోయాడు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలించారు. నటిపై దాడి (Attack on Shalu Chourasiya) చేసిన తర్వాత నిందితుడు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో సుమారు నాలుగు గంటల పాటు ఉన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారాంగా అతని కదలికలను గమనించారు. నటికి పరిచయస్తులే దాడి (Attack on Shalu Chourasiya) కి పాల్పడ్డారా? అనే కోణంలోనూ విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై పలు పీఎస్‌ల్లో కేసులు
నిందితుడు యూసఫ్‌గూడ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. సినీ పరిశ్రమలో బాబు లైట్ బాయ్‌గా పని చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నటిపై దాడి (Attack on Shalu Chourasiya) చేసిన అనంతరం.. నిందితుడు కృష్ణానగర్‌లోని నివాసానికి వెళ్లి.. ఫోన్‌ను గదిలో ఉంచాడు. ఎట్టకేలకు బాబును అరెస్ట్ చేసిన పోలీసులు... గదిలో చౌరాసియా ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుపై గతంలోనూ మూడు కేసులు ఉన్నట్లు పోలీసుల పేర్కొన్నారు. విజయవాడ, బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్‌ల్లో అతనిపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గోల్కొండ పీఎస్‌లో నమోదైన కేసులో జైలుకు వెళ్లొచ్చిన బాబు.. నటిపై దాడి (Attack on Shalu Chourasia) చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Attack on Actress: ఆ సినీనటిపై పరిచయస్తులే దాడి చేశారా?