ETV Bharat / crime

లైవ్​ వీడియో: అలా నటించారు.. మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు - rangareddy latest crimes

నగర శివారు ప్రాంతాల్లో చైన్ స్నాచర్స్ రెచ్చి పోతున్నారు. రోజురోజుకి వీరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా ద్విచక్ర వాహనం పోయిందంటూ.. చరవాణిలో దానికి సంబంధించిన ఫోటోను చూపిస్తున్నట్టు నటించారు. మాటల్లో పెట్టి వెంకటమ్మ అనే వృద్ధురాలి మంగళసూత్రాన్ని తెంచుకొని పారిపోయారు. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.

Pretending to show the photo and chain snatched by thieves in rangareddy district
లైవ్​ వీడియో: అలా నటించారు.. మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు
author img

By

Published : Feb 11, 2021, 10:20 PM IST

తన బైక్​ పోయిందని.. ఇలా ఉంటుందని.. ఫోటోను చూపిస్తున్నట్టు నటించారు. ఒక్కసారిగా ఆ వృద్ధురాలిపై దాడిచేసి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెరన్ చెరువు గ్రామం హిమగిరి నగర్ కాలనీకి చెందిన వెంకటమ్మ(57).. పిల్లలతో కలిసి సాయిబాబా గుడికి వెళుతోంది. మహిళ ఒంటరిగా ఉందని గ్రహించిన ఇద్దరు దొంగల్లో ఒకరు.. ఆమెను మాటల్లోకి దింపారు. అదను చూసి చైన్ లాక్కొని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.

లైవ్​ వీడియో: అలా నటించారు.. మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు

రెప్పపాటులో చైన్ స్నాచర్లు మంగళసూత్రాన్ని తెంచుకొని ఉడాయించారు. ఖంగుతిన్న ఆ మహిళ దొంగా దొంగా అని అరిచినా ప్రయోజనం లేకపోయింది. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కొవిషీల్డ్​తో పోలిస్తే కొవాగ్జిన్ ఉత్తమ ఫలితాలు: డీహెచ్ శ్రీనివాస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.