ETV Bharat / crime

'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

prayers at dead body
శవం వద్ద పూజలు
author img

By

Published : Aug 13, 2021, 4:29 PM IST

Updated : Aug 13, 2021, 7:40 PM IST

16:24 August 13

'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు

జగిత్యాల జిల్లాలో శవం వద్ద పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. జగిత్యాల రూరల్‌ మండలం  టీఆర్​నగర్‌లో ఓర్సు రమేశ్​ మృతి చెందాడు. మంత్రాల కారణంగానే రమేశ్​ మృతి చెందాడని.. పుల్లయ్య అనే వ్యక్తిని బాధిత కుటుంబ సభ్యులు చితక బాదారు. తానే మంత్రాలతో రమేశ్​ను చంపానని, మంత్రాలతో మళ్లీ బతికిస్తానంటూ ఉదయం నుంచి శవం దగ్గర పుల్లయ్య పూజలు చేయడం మొదలుపెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్‌ మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.

అతన్ని విడిచిపెట్టాలని కోరుతూ కొద్దిసేపు జగిత్యాల-కరీంనగర్‌ రహదారిపై గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పుల్లయ్య ఇంటిపై దాడి చేసి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసుల పహారా కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: murder: పాతకక్షలతో పొడిచి.. పొడిచి.. చంపారు

Last Updated : Aug 13, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.