ETV Bharat / crime

Fake seeds: గద్వాల జిల్లాలో నకిలీ విత్తన దందాపై కొరడా

జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ విత్తనదందాతో జేబులు నింపుకుంటున్న అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. మూడు రోజుల కిందట టాస్క్​ఫోర్స్ బృందాలు నమోదు చేసిన ఓ కేసులో ఇద్దరు ఆర్గనైజర్లను జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనతో నకిలీ విత్తన దందాపై పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా జరిగిన టాస్క్​ఫోర్స్ దాడుల్లో 18 మందిపై 15 కేసులు నమోదు చేశారు. మిగిలిన వారి అరెస్టులకూ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జ్యూడిషియల్ కస్టడీకి తరలించిన నిందితులిద్దరూ బెయిల్​పై విడుదలయ్యారు.

Fake seeds: నకిలీ విత్తన దందాపై కొరడా
Fake seeds: నకిలీ విత్తన దందాపై కొరడా
author img

By

Published : Jun 8, 2021, 10:13 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో విఫల విత్తనాలతో నకిలీ విత్తనదందా నడుపుతున్న అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లా పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందాలు చేసిన దాడుల్లో మూడు రోజుల కిందట నమోదైన కేసులో సోమవారం ఇద్దరు ఆర్గనైజర్లను పోలీసులు అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్​కు తరలించారు.

Fake seeds: నకిలీ విత్తన దందాపై కొరడా
Fake seeds: నకిలీ విత్తన దందాపై కొరడా

విత్తనాలు స్వాధీనం

గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రమ్య ఇండస్ట్రీస్​లో నకిలీ విత్తనాలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో టాస్క్​ఫోర్స్ పోలీసులు మూడు రోజుల కిందట దాడులు నిర్వయించారు. 72 సంచుల్లో 3వేల 434కిలోల విఫలమైన విత్తనాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన బండ్ల రాజశేఖర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డిపై గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఇవాళ వారిని అరెస్ట్ చేసి జ్యూడిసియల్ రిమాండ్ తరలించారు. జిల్లాలోనే పేరుమోసిన ఆర్గనైజర్లను జ్యూడీషియల్ కస్టడీకి పంపడంతో నకిలీదందా సూత్రదారులు, పాత్రదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇన్నేళ్లు టాస్క్​ఫోర్స్ దాడులు చేసి, కేసులు నమోదు చేసినా కొంతమంది తమకున్న రాజకీయ పలుకుబడితో తమపై కేసులు నమోదు కాకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా తెరవెనక మంత్రాంగం నడిపేవాళ్లు. రాజకీయ అండదండలు, పై అధికారుల ఒత్తిళ్లు ఉండటంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించేవాళ్లు కాదు. ఈసారి దాడులు చేయడం, కేసులు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి సైతం పంపడంతో.. అక్రమార్కుల్లో దడ మొదలైంది.

దందాపై ఉక్కుపాదం

నకిలీ విత్తన దందాపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు 15 రోజులుగా జిల్లాలో పలుప్రాంతాలలో టాస్క్​ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. ఇప్పటి వరకు 10వేల 230 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తన దందాలో ప్రమేయం ఉన్న వాళ్లు ఎంతటి వారైనా వదిలేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎవరైనా ఆర్గనైజర్లమంటూ నకిలీ విత్తనాలు అమ్మినా, సరఫరా చేస్తున్నట్లు తెలిసినా పోలీసులు, వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని టాస్క్ ఫోర్స్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. డయల్ -100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 9494921100 కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. సమాచారం అందించిన వారి వివరాలను సైతం గోప్యంగా ఉంచుతామని ఎస్పీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు 15 కేసుల్లో మిగిలిన వారి అరెస్టుకు సైతం పోలీసులు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు నిందితులను జ్యూడీషియల్ కస్టడికీ అప్పగించగా.. నిందితులిద్దరూ బెయిల్పై​ విడుదలయ్యారు.

ఇదీ చూడండి: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా... కొత్తది ఏర్పాటు చేయాలని వినతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.