ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తన(Fake Seeds) విక్రయాలు జోరందుకున్నాయి. పోలీసులు వాటిని అరికట్టే దిశగా చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఇచ్చోడ, గుడిహత్నూర్ మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున అనుమతి లేని విత్తన సంచులు పట్టుకున్నారు. సుమారు 25 లక్షల రూపాయల విలువైన 3,136 విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వాసవి ట్రేడర్స్, సహారా ఆగ్రో, రంజిత్, సాయి కృష్ణ అగ్రి దుకాణాలు మూసివేసి విక్రయదారులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. రైతులు అనుమతి లేని విత్తనాలు కొని మోసపోవద్దని కోరారు.
ఇదీ చదవండి: నడవలేని స్థితిలో చిరుత.. గేదెల దాడే కారణమని అనుమానం..!