వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల కేంద్రానికి చెందిన రజియా బేగం.. కుటుంబ కలహాలతో విసిగి పోయింది. పిల్లలతో సహా తనువు చాలించాలనుకుంది. గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. చెరువు వద్దకు చేరుకున్న తల్లీ పిల్లలను గమనించిన స్థానికులు.. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకటేశ్.. హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. బలవన్మరణానికి పాల్పడబోతోన్న తల్లీ పిల్లలను కాపాడారు. మహిళతో మాట్లడి.. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు, తదితర మార్గాలున్నాయని వివరించారు. ధైర్యం చెప్పి.. వారిని ఇంటికి పంపించారు.
ఇదీ చదవండి: పోలీసుల సమక్షంలో ఇసుక కుప్పలో శవం వెలికితీత