యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన జినుక శివ అనే యువకుడి హత్య కేసుని పోలీసులు ఛేదించారు. హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
ప్రేమ వ్యవహారమే కారణం..
ఎల్లంకి గ్రామానికి చెందిన జినుక శివ, ఇంటి పక్కన నివసించే గూని చంద్రయ్య కూతురు స్వప్న నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారంతో గత రెండేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి చెప్పినా.. శివ పెద్దగా పట్టించుకోలేదు.
ఈ కారణంతోనే శివని ఎలాగైనా హత్య చేయాలని చంద్రయ్య కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 11న ఇంటిముందు నుంచి వెళ్తున్న శివను, చంద్రయ్యతో పాటు తన కుమారుడు నరేష్, పెద్దనాన్న కుమారుడు ఎల్లస్వామి అడ్డుకొని గొడవపడ్డారు. మృతుని తల్లి వచ్చి వారించినా వినకుండా.. నరేష్.. శివని కత్తితో పొడిచి పారిపోయారని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం