ఆస్తిలో వాటా ఇవ్వనందుకు కన్న తండ్రినే హతమార్చిన ఓ కసాయి కొడుకుని.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణమైన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి.. ఇరువురిని రిమాండ్‌కు తరలించారు.
ఈనెల 19న.. సయ్యద్ ఇబ్రహీం, మేనల్లుడు గౌస్ మొహియుద్దీన్‌తో కలిసి తండ్రి ఇంటికి వెళ్లాడు. మొదటి భార్య కొడుకుగా.. ఇంట్లో వాటా ఇవ్వమని కోరాడు. అందుకు మౌలానా (55) నిరాకరించాడు. ఆగ్రహించిన ఆ ఇరువురు.. అతన్ని గొంతుకోసి హత్య చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.
ఇదీ చదవండి: హంతకులను పట్టించిన సైకిల్ తాళం చెవి