ETV Bharat / crime

పాతబస్తీ రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్​ కేసు - పీడీ చట్టం

పాతబస్తీలో శాంతి, భద్రతలకు ఆటకం కల్పిస్తూ.. స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఓ రౌడీషీటర్‌పై పీడీ చట్టం కింద కేసు నమోదైంది. కాలాపత్తర్‌కు చెందిన సయ్యద్‌ సాజిదుద్దీన్‌ సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

pd-act-case-against-patabasthi-rowdy-sheeter-in-hyderabad
పాతబస్తీ రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్​ కేసు
author img

By

Published : Jan 22, 2021, 10:08 AM IST

హైదరాబాద్​ పాతబస్తీ కాలాపత్తర్‌ పోలీస్​స్టేషన్​ పరిధిలో దోపిడీలతో పాటు పలు దాడులు, దౌర్జన్యాలతో ప్రమేయం ఉన్న ఓ రౌడీషీటర్‌పై.. పోలీసులు పీడీ యాక్ట్​ ప్రయోగించారు. నిందితుడు‌ సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో రెండు దోపిడీలకు పాల్పడినట్లు వారు తెలిపారు.

సయ్యద్‌ సాజిదుద్దీన్ స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదేశాల మేరకు.. కాలాపత్తర్‌ పోలీసులు రౌడీషీటర్​పై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఓఎల్ఎక్స్​లో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.