ETV Bharat / crime

'దక్కన్​మాల్'​ ఘటనలో ముమ్మర గాలింపు.. ఇంకా దొరకని ఇద్దరి ఆచూకీ

Secunderabad Fire Accident Update : సికింద్రాబాద్‌ నల్లగుట్ట డెక్కన్‌స్పోర్ట్స్‌ మాల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, క్లూస్‌ టీం.. భవనంలోని అన్ని అంతస్తుల్లో ప్రత్యేక లైట్లు ఉపయోగించి అణువణువూ గాలించారు. భవనంలోని నమూనాలను సేకరించారు. భవనం ప్రమాదకరంగా ఉన్నందున ఎవరూ అటువైపు రావొద్దని అధికారులు నోటీసులు అంటించారు.

'దక్కన్​మాల్'​ ఘటనలో ముమ్మర గాలింపు.. ఇంకా దొరకని ఇద్దరి ఆచూకీ
'దక్కన్​మాల్'​ ఘటనలో ముమ్మర గాలింపు.. ఇంకా దొరకని ఇద్దరి ఆచూకీ
author img

By

Published : Jan 22, 2023, 8:44 PM IST

Updated : Jan 23, 2023, 6:43 AM IST

'దక్కన్​మాల్'​ ఘటనలో ముమ్మర గాలింపు.. ఇంకా దొరకని ఇద్దరి ఆచూకీ

Secunderabad Fire Accident Update : భారీ అగ్నిప్రమాదం జరిగిన డెక్కెన్‌ స్పోర్ట్స్‌ మాల్‌ భవనంలో కనిపించకుండాపోయిన యువకుల కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. గల్లంతైన వారి కోసం గాలింపు సాగుతోంది. వసీం, జునైద్‌, జహీర్‌ కోసం జరిపిన గాలింపులో.. ఒకరి మృతదేహం అవశేషాలు లభించాయి. అయితే అవి ఎవరివి అనే విషయం ఇంకా తేలలేదు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.

Secunderabad Fire Accident latest news: అగ్నిమాపక శాఖ అధికారులు, క్లూస్‌ టీం నిపుణులు అన్ని అంతస్తుల్లో దాదాపు గాలించినా.. ఎలాంటి ఫలితం కనిపించ లేదు. మొదటి, రెండో అంతస్తు పైకప్పులు కూలి కిందపడటంతో అది పూర్తిగా శిథిలాలతో నిండింది. కెమెరాలు, ప్రత్యేక లైట్లతో గాలించిన క్లూస్‌టీం భవనంలోని కొన్ని వస్తువుల నమూనాలను సేకరించారు. ఆ శిథిలాల కింద మృతదేహాల అవశేషాలు ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వాటిని తొలగిస్తే పైకప్పు పరిస్థితి ఏంటి..: ప్రమాదం జరిగిన భవనంలో దాదాపు 10 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. ఇనుప గ్రిల్స్‌ పైకప్పులకు ఆనుకుని ఉండటంతో వాటిని తొలగిస్తే పైకప్పు పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకోసం ఇంజినీరింగ్‌ నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. కూల్చివేత సమయంలో పక్కనున్న భవనాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.

బిల్డింగ్ పరిసరాల్లోకి రావొద్దంటూ నోటీసులు..: ప్రత్యేక సాంకేతికత ఉపయోగించి స్థానికుల ఇళ్లకు ఇబ్బంది కలగకుండా కూల్చివేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. ప్రమాదం జరిగిన భవనం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.. సమీప పరిసరాల్లోకి ఎవరూ రావొద్దని జీహెచ్​ఎంసీ అధికారులు స్థానికంగా నోటీసులు అతికించారు. మరోవైపు కనిపించకుండా పోయిన వారి మృతదేహాలను అప్పగించాలని వారి బంధువులు కోరుతున్నారు. అవి అప్పగించే వరకు భవనం కూల్చివేత నిలిపివేయాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు..

ఇవీ చూడండి..

సికింద్రాబాద్ ఘటన.. భవనం మొదటి అంతస్తులో ఒక మృతదేహం గుర్తింపు

రాజధానిలో దారుణం.. వ్యక్తిని వేటాడి, వెంటాడి నరికి చంపిన దుండగులు

'వీరనరసింహా' జోరు.. బాలయ్య కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్​!

Last Updated : Jan 23, 2023, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.