ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ కాస్తా ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ విషాద ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన జినుక శివ(29)ను శివని గూని నరేందర్( 25) అనే యువకుడు కత్తితో పొడిచాడు. బాధితుడికి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు.
ఘటనకు ముందు మృతునిపై నిందితుడు, అతని పెద్దనాన్న కుటుంబ సభ్యులు ఓ వ్యక్తిగత విషయమై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.