వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపురం వద్ద బొలెరో వాహనాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడిన కూలీల్లో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.
కొత్తకోట మండలం అప్పరాలకు చెందిన 20 మంది కూలీలు.. బొలెరో వాహనంలో పెంచికలపాడ్లో మిరప పండ్లు తెంపడానికి వెళ్లారు. పనులు ముగించుకొని గ్రామానికి తిరిగి వస్తుండగా రంగాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. యూ టర్న్ తీసుకుంటున్న బొలెరో వాహనాన్ని కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ఉన్న చిలకమ్మ (55)తీవ్రంగా గాయపడింది.
చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చిలకమ్మకు భర్త కొండన్న.. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. మిగతా ఏడుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. చిలకమ్మ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పెబ్బేర్ పోలీసులు తెలిపారు.
ఇవీచూడండి: బొలేరోను ఢీకొట్టిన కారు.. 10 మందికి గాయాలు