Maruti Nagar Road Accident: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మారుతీనగర్ వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి ఒకరు మృతిచెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కులాల్పూర్ గ్రామానికి చెందిన వీరంతా... శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం ధర్మపురి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ క్రమంలో ఆటో మారుతీనగర్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బోల్తా పడి మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో గంగాధర్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి: