ప్రమాదవశాత్తు ఊయల చీర మెడకు చుట్టుకొని ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటుచేసుకుంది. స్థానిక యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌కు ఇద్దరు కుమారులు. ఆయన పెద్ద కుమారుడు సాహంత్... ఆడుకునేందుకు ఇంట్లో చిరతో కట్టిన ఊయల ఎక్కాడు. ఆ సమయంలో బాలుడి తల్లి నందిని ఇంటి బయట కూర్చుని చిన్న కుమారునికి అన్నం తినిపిస్తోంది.
కాసేపటి తరువాత ఆమె ఇంట్లోకి వెళ్లి చూసే వారికి సాహంత్ మెడకు చీర చుట్టుకుని ఉండడంతో పెద్దఎత్తున కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి ఊయల చీరను కత్తరించి బాలుడిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాహంత్ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం