ముదిమి వయసులో మనువళ్లు, మనువరాళ్లతో ఆడుకుంటూ.. కృష్ణా..రామా.. అనుకుంటూ బతకాల్సిన వాళ్లు(old couple) తమ బతుకును ముగించేందుకు సిద్ధపడ్డారు. కడుపున పుట్టిన వాళ్ల ఎదుగుదల చూస్తూ ఆనందంతో కళ్లు మూయాలనుకునే ఆ పండుటాకులు(old couple).. తమ వల్ల పడుతున్న ఇబ్బంది చూడలేక కన్నుమూయాలనుకున్నారు. గంపెడంత మంది పిల్లల్లున్నా.. ఏ ఒక్కరికీ భారం కాకుడదని.. ఆ ముసలి ప్రాణాలు తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేసింది.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వృద్ధ దంపతులు(old couple).. కడుపున పుట్టినవారికి భారం కాకూడదని భావించి ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటు చేసుకుంది. నరిగే కొమురయ్య నరిగే ఐలమ్మలకు నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి కాగా.. అందరికి పెళ్లిళ్లు చేశారు. ఒక్కడే కొడుకు కావడంతో దంపతులిద్దరూ ఆయన దగ్గరే ఉంటున్నారు.
రెండు నెలల క్రితం ఐలమ్మకు పక్షవాతం వచ్చింది. కొడుకు కోడలు తనకు సపర్యలు చేస్తున్నారు. మీదపడిన వయసు ఓవైపు... ముంచుకొచ్చిన అనారోగ్యం మరోవైపు.. దంపతులిద్దరినీ మంచానికే పరిమితం చేశాయి. కడుపున పుట్టిన వారికి తమ వల్ల కలుగుతున్న ఇబ్బందులను కళ్లారా చూస్తూ.. ఏమీ చేయలేక రోజూ కుమిలిపోయేవారు. కూతుళ్లేమో.. వారివారి కుటుంబాలతో ఉన్నారు. ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. వాళ్లను రోజురోజుకూ తమ బతుకు కొడుకుకు భారం అవుతున్నట్టనిపించింది.
ఇదంతా ఆలోచిస్తూ.. చివరకి విరక్తి చెందారు. ఈ బాధలన్నింటి నుంచి విముక్తి పొందాలనుకున్నారు. పుణ్యదంపతులిద్దరూ.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో పొలంలో వేసే విషపుగుళికలను కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగేశారు. ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. ఐలమ్మ పరిస్థితి కొంత నిలకడగా ఉన్నా... కొమురయ్య ఆరోగ్యం విషమంగా మారటం వల్ల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలిసి కొమురయ్య, ఐలమ్మ కూతుళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ తల్లిదండ్రులను చూసుకోవటం భారమేమీ కాదని.. ఇలా ఎందుకు చేశారో తెలియట్లేదన్నారు. ఎంత మానసిన క్షోభ అనుభవించి ఉంటే.. ఆ ముసలి ప్రాణాలు మరణించేందుకు సిద్ధపడి ఉంటారన్నది ఆలోచించాల్సిన విషయమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: