ETV Bharat / crime

బర్త్​డే పార్టీ తర్వాత బయటికే రాలేదు.. తీరా తలుపు పగులగొట్టి చూస్తే.. - model armankhan suicide

Model Suicide: బర్త్​డే వేడుకలు జరుపుకున్న ఓ మోడల్​.. మరుసటి రోజు నుంచి తన ఫ్లాట్​ నుంచి బయటకు రాలేదు. కొన్ని రోజులకు తన ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వాళ్లు పోలీసులకు తెలిపారు. తలుపులు పగలగొట్టి లోపలికెళ్లి చూస్తే.. అసలు విషయం బయటపడింది.

model amyra khan suicide in rajendranagar after her birthday party

author img

By

Published : Jan 16, 2022, 3:49 PM IST

Model Suicide: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో ఓ మోడల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయ్​నగర్​ కాలనీకి చెందిన అమైరా ​ఖాన్​(23).. మోడలింగ్​ చేస్తూ జీవనం సాగిస్తోంది. గత కొంత కాలంగా తల్లిదండ్రులకు దూరంగా.. చింతల్​మెట్​లోని మొఘల్​ మెడోస్​ అపార్ట్​మెంట్​లో ఒంటరిగా ఉంటోంది. జనవరి 7న అమైరాఖాన్​ పుట్టినరోజు సందర్భంగా.. తన ఇంట్లోనే స్నేహితులతో కలిసి బర్త్​డే వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఆ మరుసటి రోజు నుంచి అమైరా​ఖాన్​ తన ఫ్లాట్​ నుంచి బయటకు రాలేదు.

కొన్ని రోజులకు అమైరా​ఖాన్​ ఇంటి నుంచి దుర్వాసన రావటాన్ని గమనించిన అపార్ట్​మెంట్​వాసులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే.. అమైరాఖాన్​ ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. శరీరమంతా ఉబ్బి.. కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఘటనాస్థలిని రాజేంద్రనగర్​ ఏసీపీ గంగాధర్, సీఐ కనకయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమైరా​ఖాన్​.. తన స్నేహితుడు ఇమ్రాన్​ఖాన్​తో కలిసి గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తోందన్న అనుమానంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:

  • అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి.. అడ్డొచ్చిన కుమార్తెపైనా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.