Married Woman Kidnapped her Boyfriend: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం రెండో వార్డు పరిధిలోని కమలాపురానికి చెందిన ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం పట్టపగలు కారులో వేసుకొని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఐ రమేశ్, స్థానికులు తెలిపిన ప్రకారం.. కమలాపురానికి చెందిన ముత్యం శ్రీనివాస్(50) ఓ మద్యం దుకాణంలో భాగస్వామిగా ఉన్నాడు. ఆయన బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. విషయం తెలిసిన శ్రీనివాస్ కుమారుడు భరత్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు సాగించారు. అదే గ్రామానికి చెందిన మహిళ విషయమై శ్రీనివాస్‌పై రెండు మార్లు కేసు నమోదయ్యాయని సీఐ గుర్తించారు. అతడి కిడ్నాపునకు అదే కారణమనే అనుమానంతో దర్యాప్తు చేసిన వారికి అదే నిజమని రుజువైంది.
అసలేం జరిగిందంటే..
Married Woman Kidnapped her Boyfriend in Narsampet : నర్సంపేట శివారులోని కమలాపురానికి చెందిన ముత్యం శ్రీనివాస్ నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు రోజువారీ వసూలు కింద కొంత అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి ఆ మహిళ భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్..
Woman Kidnapped her Boyfriend in Narsampet : శ్రీను వల్లే తన కాపురం పాడైందని ప్రియుడిని నిలదీసింది. 2 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. పరిహారంగా గతంలో ఇచ్చిన అప్పును మాఫీ చేసి మహిళకు శ్రీను అదనంగా రూ.1.5 లక్షలు ఇవ్వాలని పంచాయతీ పెద్దలు తీర్మానం చేశారు. అక్కడితో ఆగని ఆమె.. శ్రీని ఆస్తి దక్కించుకోవాలని పథకం వేసింది. అతణ్ని పెళ్లి చేసుకోమని అడిగింది. దానికి శ్రీను అంగీకరించలేదు. ఎలాగైనా శ్రీను ఆస్తి దక్కించుకోవాలని.. అతణ్ని కిడ్నాప్ చేయాలని డిసైడ్ అయింది. ఓ సుపారీ గ్యాంగ్‌కు డబ్బు ఇచ్చి శ్రీనుని కిడ్నాప్ చేయించింది. బుధవారం రోజున పట్టణ శివారులో సుపారీ గ్యాంగ్ మాదన్నపేట కట్ట వద్ద నుంచి శ్రీనును ఎత్తుకెళ్లింది. కారులో బలవంతంగా ఎక్కించుకుని పాకాల వైపు వెళ్లింది.
అక్కడే తేల్చుకుందాం..
ఈ విషయం తెలిసిన శ్రీను కుమారుడు భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన సుపారీ గ్యాంగ్.. శ్రీనును, మహిళను గంజేడు అడవిలోకి తీసుకువెళ్లి బలవంతంగా దండలు మార్పించి ఫొటోలు తీశారు. కొంత ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పెద్దల వద్ద తేల్చుకుందామని.. శ్రీను చెప్పగా. అతణ్ని నర్సంపేట వ్యవసాయ మార్కెడ్ యార్డు ఎదురుగా మహిళ ఇంట్లో వదిలేసి పరారయ్యారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్‌ను, మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని వారిని విచారిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!