lovers suicide: రెండు మనసుల్ని దగ్గర చేసింది ప్రేమ. అదే ప్రేమ సాక్షిగా జీవితాంతం కలిసి బతకాలనుకున్న ఆ జంటను.. చివరకు పెద్దల ఆగ్రహం, ఆంక్షలు దూరం చేశాయి. ఎన్నో ఆశలతో నిర్మించుకున్న వారి ప్రేమసౌధం అర్ధాంతరంగా సమాధి అయ్యింది. ఇష్టమైన వారితో జీవించలేని బతుకు మాకేందుకు.. అనుకున్నారో..? కనీసం చావులోనైనా తోడుగా ఉండాలని తలచారో..? చివరకి తమను తాము బలిచ్చుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. పురుగులమందు తాగి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దకొత్తపల్లికి చెందిన అష్రాఫ్ ఇవాళ మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో అతడు ప్రేమించిన యువతి కళాశాలకు వెళ్లింది. అష్రాఫ్ చనిపోయాడని తెలుసుకున్న యువతి.. ఆ వార్తను జీర్ణించుకోలేక తానూ పురుగుల మందు తాగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నాగర్‌కర్నూల్‌లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం ఆ యువతి కూడా ప్రాణాలు విడిచింది. ఇరువురి మరణంతో వారిద్దరి కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. వాళ్లు చనిపోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: