ETV Bharat / crime

కుమార్తెలతో కలిసి ప్రియుడి ఇంటికి నిప్పు.. కాలిబూడిదైన భార్య, అత్త - కూతుళ్లతో కలిసి ప్రియుడి భార్య ఇంటి నిప్పు

Fire Case Mystery Revealed: ఆమె ఇద్దరు పిల్లల తల్లి. ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతగాడు వేరే పెళ్లి చేసుకోవడంతో రగిలిపోయింది. ప్రియుడిని ఎలాగైనా వశపరుచుకోవాలని దారుణానికి తెగించింది. ప్రియుడి భార్యను కాల్చి బూడిద చేయించింది. కన్నకూతుళ్లతోనే పెట్రోలు పోయించి ఇంటికి నిప్పంటించింది. తనతో పాటు బిడ్డలనూ కటకటాల పాలుచేసింది.

కుమార్తెలతో కలిసి ప్రియుడి ఇంటికి నిప్పు.. కాలిబూడిదైన భార్య, అత్త

author img

By

Published : Jul 7, 2022, 12:44 PM IST

కుమార్తెలతో కలిసి ప్రియుడి ఇంటికి నిప్పు.. కాలిబూడిదైన భార్య, అత్త

అది ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ జిల్లా కొమరగిరిపట్నం. తేదీ జులై 2. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఓ తాటాకు ఇల్లు ఉన్నట్టుండి భగ్గుమంది. ఇంట్లో ఉన్న జ్యోతి, ఆమె తల్లి మంగాదేవి కాలిబూడిదయ్యారు. ఇంతకీ ఆరోజు రాత్రి ఏం జరిగింది ? ఉన్నట్టుండి పూరిల్లు ఎందుకు దగ్ధమైంది ? ఇది ప్రమాదమా? లేక ఎవరైనా నిప్పంటించారా? మొదటి నుంచీ అనేక ప్రశ్నలతో అనుమానాస్పదంగా ఉన్న ఈ కేసును.. పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరగిరిపట్నానికి చెందిన జ్యోతి, అదే గ్రామానికి చెందిన సురేశ్‌ ఈ ఏడాది మే 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేశ్​కు అంతకుముందే అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత సురేశ్ నాగలక్ష్మిని దూరం పెట్టాడు. దీంతో నాగలక్ష్మి రగిలిపోయింది. ఎలాగైనా మళ్లీ సురేశ్‌ను వశపరుచుకోవాలని అనేక ఎత్తులు వేసింది. ఇందుకోసం తన ఇద్దరు కుమార్తెలనూ వాడుకుంది. తొలుత సురేశ్‌ కాపురంలో కలతలు సృష్టించాలని పథకం వేసింది. జ్యోతికి వేరొకరితో సంబంధం ఉందని అనుమానం రేకెత్తించేలా.. వేరే పేర్లతో కొన్ని ప్రేమ లేఖలు పంపింది. సురేశ్‌ అవేమీ నమ్మకపోవడంతో నాగలక్ష్మి.. మరో ప్లాన్‌ వేసింది. జ్యోతిని చంపేస్తే గానీ.. సురేశ్‌ తన వద్దకు రాడనే నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అత్యంత అమానవీయ పథకం వేసింది.

ఈ నెల 2న జ్యోతి, తన తల్లితో పాటు ఇంట్లో నిద్రిస్తుంది. ఇంట్లో సురేశ్ లేడని తెలుసుకున్న నాగలక్ష్మి.. తెల్లవారుజామున తన ఇద్దరు కూతుళ్లకు పెట్రోలు సీసా, అగ్గిపెట్టె ఇచ్చి పంపింది. తల్లి చెప్పినట్లే ఆ పిల్లలిద్దరూ.. జ్యోతి ఇంటిపై పెట్రోలు చల్లి నిప్పింటించారు. అగ్నికీలలు రాజుకోగానే అక్కడి నుంచి పరిగెత్తారు. తాటాకు ఇంటికి మంటలు ఒక్కసారిగా భగ్గుమనడంతో స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ.. జ్యోతితో పాటు ఇంట్లో ఉన్న ఆమె తల్లి కూడా అప్పటికే కాలి బూడిదయ్యారు.

రంగంలోకి దిగిన పోలీసులు తొలుత జ్యోతి భర్త సురేశ్‌నే అనుమానించారు. కానీ మంటలు అంటుకున్న సమయంలో ఇద్దరు దూరంగా పరిగెత్తారని ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంతో విచారణ దిశ తిరిగింది. సురేశ్‌, నాగలక్ష్మిని కలిపి విచారించడంతో మొత్తం మిస్టరీ వీడింది. ఈ కేసులో నాగలక్ష్మితోపాటు ఆమె కుమార్తెలిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చూడండి..

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.