ETV Bharat / crime

Honey trap: ఆమె 'వలపు వల' నుంచి నా కొడుకుని కాపాడండి.. ఓ తండ్రి వేడుకోలు

ఆమె.. యువకులనే టార్గెట్ చేస్తుంది. వలపు వల విసురుతుంది. అంతా నువ్వేనంటూ నమ్మిస్తుంది. ఉన్నదంతా నీకేనంటూ కవ్విస్తుంది. అందినకాడికి దోచేసుకుటుంది. ఆ తర్వాత.. పక్కన పెట్టేస్తుంది. అదేమని అడిగితే... అత్యాచారం చేశాడంటూ కేసు పెడుతుంది. హైదరాబాద్​లో ఆమె 'హనీ ట్రాప్'లో చిక్కుకున్న ఓ యువకుడి తండ్రి కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన విషయాలివి... ఆయన హెచ్​ఆర్సీని ఆశ్రయించి... ఆమె బారినుంచి తన కొడుకుని కాపాడలని వేడుకోవడంతో అసలు విషయం బయటికొచ్చింది.

kerala-lady-cheating-and-complained-the-police-against-victims-in-kushaiguda-hyderabad

author img

By

Published : Aug 11, 2021, 2:52 PM IST

Updated : Aug 12, 2021, 10:55 AM IST

హెచ్చార్సీని ఆశ్రయించిన బాధితుడి తండ్రి

కేరళకు చెందిన ల్యూకోజ్, గీతు అలియాస్ మేరీ దంపతులు ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ కుషాయిగూడలో నివాసం ఉంటున్నారు. మేరీ ముందుగా యువకులను పరిచయం చేసుకొని వలవేసుకుంటుంది. తన దారిలోకి తెచ్చుకొని తనదైన శైలిలో వారి వద్ద నుంచి తోచినంత డబ్బులు వసూలు చేస్తోంది. ఆమె దారికి అడ్డువస్తే తనపై అత్యాచారం చేసి చంపడానికి యత్నించారని వారిపై పోలీస్​ స్టేషన్​లో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తుంది. ఇదే తరహాలో కుషాయిగూడకు చెందిన ఓ యువకుడు ఆమె ఉచ్చులో ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న యువకుడి తండ్రి బ్రహ్మచారి కుషాయిగూడ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా మోసం చేస్తున్న మేరీకి వత్తాసు పలకడంతో న్యాయం కోసం పెద్దకొడుకుతో కలిసి హెచ్చార్సీని ఆశ్రయించారు.

డబ్బు లేదంటే బ్లాక్​ మెయిల్​

తనకు ఒక కూతురు, ఇద్దరు కుమారులని బ్రహ్మచారి పేర్కొన్నారు. కుషాయిగూడలోని హోసింగ్ కాలనీకి మేరీ దంపతులు 2015లో వచ్చారని చెప్పారు. తన చిన్న కొడుకు పరమేశ్​​ను మేరీ తన వలలో వేసుకొని రూ. ఐదు లక్షల వరకు వసూలు చేసిందని వివరించారు. ఇంకా డబ్బులు తీసుకురావాలని బెదిరింపులకు పాల్పడటంతో తన కుమారుడు తనదగ్గర డబ్బులు లేవని చెప్పాడని అన్నారు. ఆమెపై హత్యాచారానికి యత్నించినట్లు కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మేరీని నిలదీస్తే తన పెద్దకుమారుడు ధనుంజయపై లైంగిక వేధింపుల కేసు పెట్టిందని చెప్పారు. మేరీ, ఆమె భర్త ఇద్దరూ వ్యభిచార దందా నడుపుతున్నారని... అందుకే స్థిరంగా రెండు మూడు నెలల కంటే ఎక్కువ ఉండరని వివరించారు.

అందుకే హెచ్చార్సీకి వచ్చా

రీతు దంపతులు కేరళ నుంచి ఇక్కడకు వచ్చారు. పేరు మార్చుకొని 17 నుంచి 18 ఏళ్ల యువకులతో పరిచయం పెంచుకుంటుంది. వారిని లొంగదీసుకొని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. డబ్బులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టిస్తుంది. పోలీసులూ ఆమెకు మద్దతుగా ఉన్నారు. ఇలా ఎంతోమంది తమ బాధలు బయటకు చెప్పుకోలేని బాధితులు ఉన్నారు. అందుకే న్యాయం చేయాలని హెచ్చార్సీని ఆశ్రయించా. ఇకముందు ఆమె బారిన ఏ అబ్బాయి పడకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా.

-బ్రహ్మచారి, బాధితుడి తండ్రి

ఇలా చాలా మంది ఉన్నారు

తమ కుమారుడితో పాటు చాలామంది యువకులు ఈ మహిళ చేతిలో మోసపోయి... బయటకు చెప్పుకోలేక భయపడుతున్నారని బాధితును తండ్రి పేర్కొన్నారు. ఇలా మరికొంతమంది మోసపోకుండా ఉండాలంటే సహకరిస్తున్న పోలీసులు, మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె చెరలో ఉన్న తమ కుమారుడిని తమకు అప్పజెప్పాలని బ్రహ్మచారి కన్నీరు పెట్టుకుంటూ హెచ్చార్సీని వేడుకున్నారు. ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.. నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాచకొండ పోలీసు కమిషనర్​ను ఆదేశించింది.

ఇదీ చదవండి: ATM FRAUDS: వాళ్లు డబ్బు డ్రా చేస్తారు... కానీ వారి అకౌంట్​లో నగదు కట్ కాదు!

Last Updated : Aug 12, 2021, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.