ETV Bharat / crime

మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.. రూ. 7లక్షలు స్వాధీనం - policemen who catch sheep thieves

Goats And Sheeps Theft In Kandukuru: కందుకూరు పీఎస్ పరిధిలో దెబ్బడగూడ గేట్​ సమీపంలో మేకలు, గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 6.97 లక్షల నగదు, 35 గొర్రెలు, 3 సెల్​ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.

కందుకూరులో మేకలు గొర్రెలు దొంగిలిస్తున్న ముటాను పట్టుకున్న పోలీసులు..

author img

By

Published : Nov 9, 2022, 10:38 PM IST

Updated : Nov 10, 2022, 7:22 PM IST

Goats And Sheeps Theft In Kandukuru: ఇబ్రహీంపట్నం, కందుకూరు, హయత్ నగర్ ప్రాంతాలలో గొర్రెలు, మేకలను దొంగతనం చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముగ్గురు దొంగలను కందూకురు పోలీసులు అరెస్టు చేశారు. అరవింద్ సాయి, మనోహర్, ముకేష్ అనే ముగ్గురు 12 కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఏసీపీ ఉమామహేశ్వరరావు తెలిపారు. నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో వీరు చైన్​ స్నాచింగ్​కి కూడా పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.

వీళ్లు దొంగతనానికి పాల్పడే ముందు రైతుల వేషంలో ప్రాంతాలను రెక్కీ నిర్వహించి ఆ తరువాత రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ వెల్లడించారు. అలా దొంగతనం చేసిన గొర్రెలను మారు బేరానికి అమ్ముతారని తెలిపారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు పోలీస్​ స్టేషన్​ దెబ్బడగూడ గేట్​ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి ఆ ముగ్గరిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చిందని ఏసీపీ వెల్లడించారు. ఈ తనిఖీల్లో​ భాగమైన సీఐ కృష్ణంరాజు, ఎస్ఐ​ శ్రావణ్​ కుమార్​, కానిస్టేబుళ్లు విజయ్​ కుమార్​, వి. మల్లేష్​, వెంకటేష్​లకు ఏసీపీ రివార్డులను అందజేశారు.

మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.. రూ. 7లక్షలు స్వాధీనం

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.