సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పెద్దచెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు కోదాడ పట్టణానికి చెందిన గునుగుంట్ల నవీన్‌గా పోలీసులు గుర్తించారు. జ్వరం రావడంతో వారం నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్న నవీన్.. నిన్న ఉదయపు నడకకు వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని స్థానికులు తెలిపారు.
కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న నవీన్.. మనస్తాపానికి గురై... ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. నవీన్ నిడమనూరు పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కష్టకాలంలో సేవచేయడానికి యువవైద్యులు ముందుకు రావాలి: సీఎం