ETV Bharat / crime

WOMAN ARREST: 'గీతా ఆర్ట్స్‌' ఎదుట మహిళ హడావుడి.. అరెస్టు - తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట హల్‌చల్‌ చేసిన మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్‌పేట ప్రాంతంలో కొంత కాలంగా పుచ్చకాయలు విక్రయిస్తున్న సునీత బోయకు గతంలో సినీ పరిశ్రమతో సంబంధాలు ఉండేవి. ఈ క్రమంలో అవకాశం కల్పిస్తానంటూ బన్నీ వాసు మోసం చేశారని ఆమె చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. ఆమె రెండు సార్లు జైలుకు వెళ్లడం గమనార్హం.

WOMAN ARREST, sunitha boya arrest due to allegations on bunny vasu
సునీత బోయ అరెస్ట్, బన్నీ వాసుపై ఆరోపణలు చేసిన మహిళ అరెస్ట్
author img

By

Published : Jul 14, 2021, 12:49 PM IST

Updated : Jul 14, 2021, 3:32 PM IST

సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని, ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లోని గీతా ఆర్ట్స్‌ కార్యాలయం వద్దకు వచ్చిన సునీత బోయ అనే మహిళను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మలక్‌పేట ప్రాంతంలో కొంత కాలంగా పుచ్చకాయలు విక్రయిస్తున్న సునీత బోయకు గతంలో సినీ పరిశ్రమతో కొంత సంబంధాలు ఉండేవని పోలీసులు తెలిపారు. బన్నీ వాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ మోసం చేశాడని ఆమె చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు, ఆయన సంబంధీకులు ఇప్పటికే నాలుగుసార్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రెండు సార్లు జైలుకు కూడా వెళ్లారు.

రెండుసార్లు ఎర్రగడ్డలోని ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. తాజాగా వారం కిందట ఆమె మరో వీడియో పోస్టు చేశారు. బన్నీ వాసు బెదిరింపులకు గురిచేస్తున్నాడంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆ వీడియోలో ఆమె పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందుకు వచ్చిన సునీత బోయను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కార్యాలయం మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. అలాగే ఆమె మానసిక స్థితి సరిగా లేదని, మానసిక చికిత్సాలయానికి తరలించాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు న్యాయమూర్తిని కోరారు.

ఇదీ చదవండి: Ajay Devgn: దేశభక్తి కథ.. మళ్లీ కాసులు కురిపిస్తుందా?

Last Updated : Jul 14, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.