ETV Bharat / crime

ఏపీలో దొంగల హల్​చల్​.. స్కూల్లో మహిళా ఉద్యోగుల గొలుసులు చోరీ

Jewelery Theft in a Government School: తిరుపతి జిల్లాలో గొలుసు దొంగలు హల్​చల్ చేశారు. ఒకే స్కూలు ఆవరణలో ఇద్దరు టీచర్లు, ఒక ఆయమ్మ గొలుసులను లాక్కెళ్లి.. పోలీసులకు సవాల్ విసిరారు. గొలుసు దొంగల ముఠానే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కగా ప్రాంతం, సమయం చూసి.. ఈ దోపిడీకి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు.

Jewelery Theft in a Government School
Jewelery Theft in a Government School
author img

By

Published : Dec 16, 2022, 10:51 PM IST

ఏపీలో దొంగలు హల్​చల్​.. స్కూల్లో మహిళా ఉద్యోగుల గొలుసులు చోరీ

Jewelery Theft in a Government School: తిరుపతి జిల్లాలో ఓజిలి మండలం వాకాటివారి కండ్రిగ మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమిక పాఠశాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ఎన్నుకున్నారు. ఈ గ్రామంలోని ప్రజలందరూ ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లిపోతారు. ఇదే అదునుగా భావించిన ముగ్గురు దొపిడి దొంగలు బైక్​పై అక్కడే రోడ్డు ఆనుకుని ఒకే ఆవరణలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరుకున్నారు.

ఒకరు బైక్​పై కూర్చుని సిద్ధంగా ఉన్నారు. మరో ఇద్దరు యువకులు నేరుగా పాఠశాల గదుల వద్దకు వెళ్లారు. వారిని చూసి ఎవరో విద్యాశాఖ అధికారులు తనిఖీ నిమిత్తం వస్తున్నారని ఉపాధ్యాయురాలు, అంగన్వాడీ కార్యకర్త ముందుకు వచ్చారని తెలిపారు. చోరీ కోసం వచ్చిన ఆ ఇద్దరు యువకులు వెంటనే కత్తి తీసి వారి మెడపై పెట్టడంతో అరవలేకపోయారు. వీరు వేర్వేరు గదుల్లో ఉండటంతో భయపడిపోయామని తెలిపారు.

మాస్కులు, హెల్మెట్లు వేసుకుని ఉన్న ఆ ఇద్దరు యువకులు కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇద్దరి మెడలోని ఎనిదన్నర సవర్ల బంగారు నగలను దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అనంతరం ఆ మహిళలు తేరుకుని మండల విద్యాశాఖ అధికారులతో పాటుగా పోలీసులకు సమాచారమిచ్చినట్లు వెల్లడించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. చోరీకి పాల్పడిన యువకుల కోసం గాలిస్తున్నారు.

జాతీయ రహదారిపై బూదనం, సూళ్లూరుపేటల వద్దగల టోల్ ప్లాజాలోని సీసీ టీవీ పుటేజీ పరిశీలిస్తున్నారు. చోరీ చేసే వ్యక్తులు అనుమానం రాకుండా సరికొత్త రీతిలో చేస్తున్నారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.