ETV Bharat / crime

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​.. బంగారం స్వాధీనం - హైదరాబాద్​ తాజా వార్తలు

దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 20 లక్షల విలువైన బంగారం, వెండి, రెండు ఎల్‌ఈడీ టీవీలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

interstate rabbory gang arrested by hydrabad police
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​.. బంగారం స్వాధీనం
author img

By

Published : Feb 19, 2021, 10:33 PM IST

ప్రజలను మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సలీమ్‌ అలీ, మహ్మద్‌ సాదిఖ్‌, కుర్‌బాన్‌ అలీ మరో ఇద్దరు కలిసి ఎంచుకున్న నగరాల్లో దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడేవారు. ప్రధాన నిందితుడు సలీమ్‌ అలీ ఆధ్యాత్మిక గురువుగా నటించి పలువురిని నమ్మించేవాడు.

ఇతర నిందితులు అతనికి భక్తులుగా నటించే వారు. తనకు మంత్ర శక్తులు ఉన్నాయని బంగారం, వెండి తాను చెప్పిన ప్రాంతంలో ఉంచితే, మరుసటి రోజు రెండింతలవుతాయని చెప్పేవాడు. ఈ విధంగా పలువురిని నమ్మించి ఏమరుపాటుగా ఉన్న సమయంలో... విలువైన ఆభరణాలతో ఈ ముఠా ఉడాయించేదని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. చార్మినార్‌, ఉప్పల్‌, మోండా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్లలో ఈ ముఠా ఈ తరహా నేరాలకు పాల్పడినట్టు ఆయన చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సీపీ వివరించారు.

ఇదీ చదవండి; ట్రాన్స్ జెండర్స్​ సంక్షేమంపై ఆలోచిస్తాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.