గోవా నుంచి ఏపీకి.. అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న 14 మందిని ఏపీ, గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఏడుగురు.. నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. రూ.40 లక్షల విలువ గల మద్యం బాటిళ్లతో పాటు ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఏడుగురు వ్యక్తులు.. మరో ఏడుగురు ఏపీ వాసులతో కలిసి ఈ అక్రమానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నిందితులు.. గోవా నుంచి లారీలో గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని తీసుకొచ్చి.. రెండు రాష్ట్రాల్లో విక్రయించేవారని వివరించారు.
కేసు ఛేదనకు కృషి చేసిన మిర్యాలగూడ ఎక్సైజ్ పోలీసులకు.. అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: రైలు కింద పడి ఆత్మహత్య.. కారణమదే..!