హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుక్కా సెంటర్‌పై దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు(task force police raid on hukkah centers) దాడులు నిర్వహించారు. నిషేధిత హుక్కా సేవిస్తున్న 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా హుక్కా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుర్‌ఖాన్ అనే వ్యక్తి ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా హుక్కా సెంటర్ నడుపుతున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ సీఐ రాఘవేంద్ర హుక్కా సెంటర్‌పై ఆకస్మిక దాడి (police raid on hukkah centers) నిర్వహించారు. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మంది మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. 15 హుక్కాలు, భారీగా హుక్కా ఫ్లేవర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడ్డ వారిని విచారణ నిమిత్తం రెయిన్ బజార్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త..
మొదట సరదాగా ఒక్కసారి తీసుకుంటే ఏమవుతుందిలే అనుకుని మొదలుపెడతారు. కానీ మత్తు పదార్థం లక్షణమే అది కాబట్టి మళ్లీ మళ్లీ తీసుకోవాలనిపిస్తుంది. దాంతో తీసుకునే సందర్భాలు పెరుగుతాయి. కొన్నాళ్లకి ఆ మోతాదు అలవాటైపోయి, తృప్తి కలగక ఇంకా ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అప్పటికి అది వ్యసనం స్థాయికి వెళ్లిపోతుంది. వాళ్ల ధ్యాస ఎప్పుడూ మళ్లీ దాన్ని ఎలా సంపాదించాలన్న దాని మీదే ఉంటుంది. ఎప్పుడన్నా ఇది మంచిది కాదు, నేను ఇందులోనుంచి బయటపడాలీ అనుకున్నా ఎంతోసేపు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేరు. డబ్బు దొరక్కో, ఇంట్లోవాళ్లు కట్టడి చేస్తేనో కొంత కాలం ఉన్నా అవకాశం దొరకగానే మళ్లీ తీసుకుంటారు. జన్యుపరమైన కారణాలు కూడా వ్యసనానికి దారితీస్తాయి. తల్లిదండ్రులో తోడబుట్టినవారో మద్యపానం లాంటి వ్యసనాలు కలిగివుంటే ఆ కుటుంబంలో(parents be alert about drugs in Hyderabad) పిల్లలు మత్తుపదార్థాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉందంటున్నారు నిపుణులు. డిప్రెషన్, ఏడీహెచ్‌డీ లాంటి మానసిక సమస్యలు ఉన్నవారిలోనూ వ్యసనాల రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. డ్రగ్స్ అయినా, మద్యం అయినా ఎక్కడ దొరుకుతాయో అందరికీ తెలుసు. అయినా కొందరు మాత్రమే ఆ వ్యసనం బారిన పడడానికి పైన చెప్పిన కారణాల్లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే పిల్లల(parents be alert about drugs in Hyderabad) ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రేమ పేరుతో 14 ఏళ్ల బాలిక మృతికి కారణమైన ఆటో డ్రైవర్