ETV Bharat / crime

MURDER ATTEMPT: భర్త చేతిలో దాడికి గురై కోలుకుంటున్న భార్య, కుమారుడు - husband tried to kill wife in warangal

కుటుంబ తగాదాలు ఎంతో మంది ఉసురు(MURDER ATTEMPT) తీస్తున్నాయి. కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బిడ్డలు.. అనే తేడా లేకుండా విచక్షణారహితంగా తనవాళ్లపైనే దాడి(MURDER ATTEMPT) చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. క్షణికావేశంలో.. తన వాళ్ల ప్రాణాలు తీసి.. మరుక్షణమే ఎంతో మంది.. పశ్చాత్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Murder in Warangal, Attempted murder of wife in Warangal, Warangal News
వరంగల్​లో మర్డర్, వరంగల్​లో భార్యపై హత్యాయత్నం, వరంగల్ న్యూస్
author img

By

Published : Jul 3, 2021, 12:20 PM IST

Updated : Jul 3, 2021, 12:33 PM IST

కుటుంబ తగాదాలు.. అతణ్ని విచక్షణ కోల్పోయేలా చేశాయి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలే పెద్దవిగా మారి.. అతనిలో ఆవేశాన్ని పెంచాయి. రోజూలాగే.. ఆరోజు కూడా భార్యతో గొడవ పడ్డాడు. క్షణికావేశంలో.. విచక్షణ కోల్పోయి ఆమెపై విరుచుకుపడ్డాడు. బ్లేడు(MURDER ATTEMPT)తో ఆమె గొంతు కోశాడు. ఏం చేస్తున్నాడో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్న అతను.. అదే ఆవేశంలో అడ్డొచ్చిన కుమారుడిపైనా దాడి చేశాడు. ప్రాణాలతో పోరాడుతున్న ఆ తల్లీకొడుకులు ప్రస్తుతం కోలుకుంటున్నారు.

వరంగల్‌లో భర్త చేతిలో దాడికి గురైన భార్య, ఆమె కుమారుడు...... ఎంజీఎం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కాకతీయకాలనీకి చెందిన చిన్నా..... కుటుంబ తగాదాలతో విచక్షణ కోల్పోయి భార్య, కుమారుడి గొంతు కోశాడు. ఆ తర్వాత అతను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న చిన్నాకు.. భార్య శోభారాణి, ఇద్దరు పిల్లలు చందన, జయవర్దన్‌ ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా శోభతో గొడవపడిన చిన్నా.. ఆవేశంలో .. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. శోభ కేకలు పెట్టడంతో మరో గదిలో నిద్రిస్తున్న పిల్లలు బయటకు వచ్చారు.

విచక్షణ కోల్పోయిన చిన్నా.... కుమారుడి గొంతు కూడా కోశాడు. భయాందోళనకు గురైన కూతురు... బయటకు పరుగెత్తి స్థానికులకు చెప్పింది. వారు వచ్చి చూసేసరికి చిన్నా కూడా గొంతు కోసుకున్నాడు. స్థానికులు వెంటనే వారిని ఎంజీఎం ఆసుత్రికి తరలించారు. ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 3, 2021, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.