ETV Bharat / crime

బ్యాంక్​లో తాకట్టు పెట్టిన బంగారం మాయం..రూ.కోటి 70 లక్షలు చోరీ - Theft of gold in the bank

Gold stolen from Union Bank: అవసరానికి ఇష్టం లేకపోయిన సరే తప్పక బ్యాంక్​లో బంగారం తాకట్టు పెడతాం. బ్యాంక్​లో భద్రంగా ఉంటుందని నమ్మకంతో ఖాతాదారులు ఉంటారు. అయితే ఓ బ్యాంక్​లో తాకట్టు పెట్టిన బంగారాన్ని మాయం చేశారు. ఈ బంగారాన్ని ఎవరు మాయం చేశారు? బంగారం విలువ ఎంత? ఇంతకి ఖాతాదారునికి న్యాయం జరిగిందా? ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పల్లాడు జిల్లాలో జరిగింది.

Gold stolen from Union Bank
యూనియన్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం
author img

By

Published : Jan 26, 2023, 5:56 PM IST

Gold stolen from Union Bank: ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలోని యూనియన్ బ్యాంకులో బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఉద్యోగులే మాయం చేశారు. బ్యాంక్ అప్రయిజర్ ఇమ్మిడిశెట్టి సంపత్ కుమార్ ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. మొత్తం కోటి 70 లక్షల విలువ చేసే బంగారాన్ని అప్రయిజర్ మాయం చేశారు.

తాము తీసుకున్న రుణం చెల్లించిన తర్వాత కూడా బంగారం ఇవ్వకపోవటంతో బ్యాంకు అధికారుల్ని ఖాతాదారులు నిలదీశారు. బ్యాంకు అధికారుల విచారణలో బంగారం మాయమైనట్లు తేలింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజర్ రాంబాబు నాయక్, అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్​ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బంగారం మాయమవటంపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం తీసుకెళ్లిన సంపత్ కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అతడిని విచారించిన తర్వాత ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనేది తెలుస్తుందంటున్నారు. బంగారాన్ని రికవరీ చేసిన తర్వాత పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు.

యూనియన్ బ్యాంకులో బంగారం పెట్టాము. బంగారానికి రెండున్నర లక్షలు డబ్బులు కట్టాం. బంగారం రిలీజ్​ చేయడానికి మధ్యాహ్నం 3గంటలకి రమ్మన్నారు.. వెళ్తే మీ బంగారం బ్యాంకులో దొరకలేదు.. వెతుకుతున్నాం అని అంటున్నారు.. రెండు రోజుల నుంచి వెళ్తున్నా మా బంగారం ఇవ్వలేదు... డబ్బులు అయితే కట్టాం.- అంజలి, బాధితురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.