నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్- శ్రీశైలం ప్రధాన రహదారికి ఆనుకుని అక్టోపస్ వ్యూ పాయింట్ కలదు. అక్కడి నుంచి నీలారం బండల వరకూ సుమారు రెండు కిలోమీటర్ల మేర అడవుల్లో మంటలు ఎగసి పడ్డాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒకసారి మంటలు రాగా అటవీశాఖ సిబ్బంది ఆర్పివేశారు.
మళ్లీ రాత్రి 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని... మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. శరవేగంగా మంటలు వ్యాపిస్తుండటంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు.. సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. వేసవి కాలంలో నల్లమలలో మంటలు చెలరేగడం సహజమే. కానీ ఎక్కువ విస్తీర్ణంలో వచ్చినప్పుడే ఆర్పడం కష్టంగా మారుతోంది.
ఇదీ చూడండి : చున్నీతో భర్తను చంపిన భార్య